జాతీయ వార్తలు

హైదరాబాద్‌లో ఉగ్రదాడికి వ్యూహరచన: ఆరుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు ఉగ్రవాదులు వ్యూహరచన చేశారన్న సమాచారంతో జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఎ) అధికారులు పాతబస్తీలో బుధవారం ఉదయం విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి భారీ ఎత్తున మారణాయుధాలు, పేలుడు సామగ్రి, నగదును స్వాధీనం చేసుకున్నారు. సామాజిక వెబ్‌సైట్లలో ఒక గ్రూపుగా ఏర్పడి హైదరాబాద్ సహా పలుచోట్ల ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించేందుకు కొందరు వ్యూహరచన చేసినట్లు ఎన్‌ఐఎకు సమాచారం అందడంతో ఈ దాడులు జరిగాయి. దిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఐఎ ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని తమ వెంట దేశ రాజధానికి తీసుకునివెళ్తున్నారు. గత ఏడాది కూడా ఇలాగే కొందరు వ్యక్తులు సామాజిక వెబ్‌సైట్లలో ఒక గ్రూపుగా ఏర్పడి ఉగ్రదాడులకు పథకం వేసినపుడు కూడా హైదరాబాద్‌లో తనిఖీలు చేసి కొందరిని అరెస్టు చేశారు. స్థానిక పోలీసుల సహకారంతో దిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఐఎ అధికారులు పాతబస్తీలో జల్లెడ పట్టారు.