క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు వికాస్ క్వాలిఫై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 12: భారత డిస్కస్ డ్రోయర్ వికాస్ గౌడకు వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అర్హత లభించింది. వాస్తవానికి డిస్కస్‌ను 66 మీటర్ల దూరం విసిరిన వారికే ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాహణ కమిటీ తొలుత ప్రకటించింది. అయితే, ఇటీవల ఆ నిబంధనను మార్చి, 65 మీటర్లకు ఖరారు చేసింది. ఈ ఏడాది మేలో జమైకాలో జరిగిన ఇన్విటేషనల్ అథ్లెటిక్ మీట్‌లో వికాస్ 65 మీటర్ల దూరానికి డిస్కస్‌ను విసరడంతో, అతనికి ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. జెమైకా ఈవెంట్‌ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) గుర్తించడం, నిర్వాహకులు దూరాన్ని ఒక మీటర్ తగ్గించడం వికాస్‌కు కలిసొచ్చాయ.
సప్న, నితేంద్రకూ అవకాశం: సవరించిన అర్హత ప్రమాణాలను అనుసరించి మహిళల 20 మీటర్ల నడకలో సప్న, పురుషుల మారథాన్ ఈవెంట్‌లో నితేంద్ర సింగ్ రావత్‌కు కూడా రియో ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం లభించింది. వీరిని కూడా చివరి క్షణాల్లో అదృష్టం వరించింది.