బిజినెస్

8న ఒకరోజు బ్యాంక్ సమ్మెకు పిలుపునిచ్చిన ఎఐబిఇఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వడోదర, డిసెంబర్ 28: అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ).. ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. జనవరి 8న ఈ సమ్మెకు దిగుతుండగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ అనుబంధంగా ఉన్న ఐదు బ్యాంకులు చేసిన ఉద్యోగుల విధినిర్వహణ ఒప్పందాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా ఈ సమ్మెను ఎఐబిఇఎ తలపెడుతోంది. ఈ మేరకు ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం ఓ ప్రకటనలో సోమవారం తెలిపారు. ఎస్‌బిఐకి అనుబంధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్‌కోర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాల, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్ పని చేస్తున్నది తెలిసిందే.