యువ

భలే గాడ్జెట్స్ గురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళాలతో ఇక పనిలేదు ! తలుపులు తెరిచే ‘సిసేమ్’!
------------------------------------------------------

ఓపెన్ సిసేమ్!

ఈ మాట ఎక్కడో విన్నట్టుంది కదూ! అలీబాబా నలభై దొంగలు కథ చదివారా? అందులోదే కదా ఈ మాట! దొంగల డెన్‌లోకి వెళ్లేందుకు తలుపు ముందు నించుని అలీబాబా ‘ఓపెన్ సిసేమ్’ అనగానే తలుపు తెరుచుకుంటుంది. గుర్తొచ్చింది కదూ! మీ తలుపుల్ని కూడా ఇకపై ఈ ఒక్క డైలాగ్ చెప్పి తెరవచ్చు. తాళాలతో పనిలేదు. నిజమే. సిసేమ్ అన్నది ఓ చిన్న పరికరం. దీనిని తేలిగ్గా తలుపుకు ఓ కమాండ్ టేప్‌తో తగిలించేయొచ్చు. దీనిని అనుసంధానిస్తూ ఓ యాప్ ఉంటుంది. దీనిని డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు...స్మార్ట్ఫోన్‌తో ఆపరేట్ చేయడమే. మీరు లేనప్పుడు బంధువులు ఇంటికి వచ్చినా మీరు వచ్చేంతవరకూ వారు పడిగాపులు పడనక్కర్లేదు. మీరు ఎక్కడున్నా యాప్‌ను ఆపరేట్ చేస్తే చాలు తలుపు తెరుచుకుంటుంది. అంతేకాదు...తలుపును ఏయే సమయంలో తెరిచిందీ లేదా వేసిందీ కూడా ఈ యాప్ మీకు లెక్కచెపుతుంది. బాగుంది కదూ ఈ సిసేమ్! దీని ధర 99 డాలర్లు.

ఎక్కడ ఉన్నా, ఏమైనా!

పెట్స్ జాడ చెప్పే ‘గో పెట్’

పెంపుడు జంతువులు తప్పిపోతే పెద్ద తలనొప్పి. ఆ సమస్యను పరిష్కరించేందుకు వచ్చిందే - గో పెట్. ఈ సరికొత్త గాడ్జెట్‌ను కుక్క మెడకు తగిలిస్తే సరి. ఎక్కడ ఏం చేస్తున్నా ఓ కంట కనిపెట్టొచ్చు. అంతేనా...కుక్క ఏం చేస్తోందో, ఎక్కడ ఉందో చూడొచ్చు కూడా. కుక్క చేసే శబ్దాలను వినొచ్చు. కాకపోతే ఈ గాడ్జెట్ ఖరీదు కాస్త ఎక్కువే. ఎంతంటే...160 డాలర్లు!

ఈ కళ్లజోడు తీరే వేరు!

ఉడెన్ సన్‌గ్లాసెస్ కా కమాల్

ఏ వస్తువైనా పనితీరే కాదు...చూడటానికి కూడా ఆకర్షణీయంగా, డిఫరెంట్‌గా కనిపించాలి. అప్పుడే దానికి డిమాండ్ పెరుగుతుంది. పైగా యూత్‌ను ఆకట్టుకుంటే మరీ మంచిది. అలాంటి ఉద్దేశంతో తయారు చేసినవే వుడెన్ ఫ్రేమ్ సన్‌గ్లాసెస్. పీపింగ్ థార్న్ అనే సంస్థ తయారు చేసిన ఈ చెక్కతో తయారు చేసిన సన్‌గ్లాసెస్‌కు ఇప్పుడు భలే గిరాకీ అట. వీటి ధర 100 డాలర్లు! *