రాష్ట్రీయం

చురుగ్గా ఆపరేషన్ మదద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైనుంచి విమానంలో 106మంది ప్రయాణికుల తరలింపు
సురక్షితంగా తీసుకువచ్చిన హైదరాబాద్ రెస్క్యూ టీమ్
చెన్నై నుంచి ఆంధ్ర, తెలంగాణకు వచ్చే 19 రైళ్ల రద్దు
బాధితులకు 24 గంటలు వైద్య సేవలు: అపోలో ప్రకటన
హైదరాబాద్/బేగంపేట, డిసెంబర్ 3: చెన్నైలో వరద బాధితులను ఆదుకునేందుకు తెలంగాణలో ఉన్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ విభాగం రెస్క్యూ టీం నడుం బిగించింది. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి చెన్నై బయలుదేరిన సైనిక, నావిక, వైమానిక దళాలు సాయంత్రానికి అరక్కోణం నుంచి 106మంది ప్రయాణికులను హైదరాబాద్‌కు తరలించాయి. వీరంతా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుబడితే, అరక్కోణం ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడినుంచి వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ‘ఆపరేషన్ మదద్’ పేరుతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి వైద్య సౌకర్యం, నీరు, ఆహారం వంటి సహాయాన్ని అందిస్తున్నట్టు బేగంపేట్ ఎయిర్ ఫోర్స్ కమాండెంట్ సురేష్ భడియాల్ తెలిపారు. ఇండియన్ ఆర్మీ అత్యవసర సేవల్లో భాగంగా సి-17 ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన రెండు ప్రత్యేక విమానాల ద్వారా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. నగరానికి చేరుకున్న ప్రయాణికులకు ఆహారం, నీళ్లు, వైద్య సదుపాయం కల్పించి వారివారి గమ్యస్థానాలకు చేరే విధంగా ఏర్పాట్లు చేశామని, వీరిలో అధిక శాతం బెంగుళూరు, ఢిల్లీ ప్రయాణికులు ఉన్నారని ఆర్మీ బిగ్రేడ్ కంటోనె్మంట్ అధ్యక్షుడు అజయ్‌సింగ్ తెలిపారు. అదేవిధంగా గురువారం సాయంత్రం చెన్నైకు మరో ప్రత్యేక విమానం సి-17లో వాటర్ బోట్స్, ఆహారం, నీళ్లు, మెడికల్ కిట్లు, దుస్తులు పంపించినట్టు కమాండెంట్ పేర్కొన్నారు.
అదేవిధంగా భారీ వర్షాల కారణంగా చెన్నై నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే 16 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ-చెన్నై, చెన్నై- ఎగ్మోర్ ఎక్స్‌ప్రెస్, చార్మినార్ ఎక్స్‌ప్రెస్, చెన్నై సెంట్రల్-్ఢల్లీ ఎక్స్‌ప్రెస్‌లు రద్దయిన వాటిలో ఉన్నాయి. అదేవిధంగా మరో ఏడు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఉమాశంకర్ కుమార్ తెలిపారు. హౌరా-చెన్నై ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్-చెన్నై ఎక్స్‌ప్రెస్, నిజాముద్దీన్-చెన్నై ఎక్స్‌ప్రెస్, ముంబయి-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లను కూడా రద్దు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. చెన్నై వెళ్లే, లేదా అక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, తిరువంతపురం, విశాఖపట్నం, మదురై, కొచ్చితో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఎయిర్ ఇండియా, ట్రావెల్ ఏజెంట్లు జారీ చేసిన టికెట్లు ఈ నెల 15వరకు చెల్లుబాటు అవుతాయని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు. అదనపు చార్జీలు కానీ, క్యాన్సల్లేషన్/రిఫండ్ చార్జిల్లో కూడా మినహాయింపు ఉంటుందని అధికారులు తెలిపారు. చెన్నై వరద బాధితులకు అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో 24గంటల వైద్య సౌకర్యం అందిస్తున్నట్టు అపోలో యాజమాన్యం ప్రకటించింది. చెన్నై పరిధిలోని అపోలో ఆసుపత్రుల వైద్య బృందం తమ పరిధిలోని వరద బాధిత ప్రాంతాలకు వెళ్లి వైద్య సేవలు అందించనున్నట్టు అపోలో యాజమాన్యం ప్రకటనలో తెలిపింది. విమాన ప్రయాణీకుల సదుపాయం నిమిత్తం ఈ నెల 6వ తేదీ వరకు అరక్కోణం నేవల్‌బేస్ నుంచి విమాన సర్వీసులు నడుపుతామని ట్రూజెట్ ఫ్లైస్ సంస్ధ ఎండి వి ఉమేష్ తెలిపారు. (చిత్రం) ‘ఆపరేషన్ మదద్’ పేరుతో వరద బాధితులను గురువారం చెన్నైనుంచి విమానంలో హైదరాబాద్‌కు తీసుకువచ్చిన రెస్క్యూ టీమ్.