తెలంగాణ

టిఆర్‌ఎస్ మేనిఫెస్టోలా గవర్నర్ ప్రసంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* విపక్షాల విమర్శ
హైదరాబాద్, మార్చి 10: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై విపక్షాల సభ్యులు విమర్శలు కురిపించారు. అధికార పార్టీ రూపొందించిన అబద్ధాలతో కూడిన ప్రసంగాన్ని వినాల్సి వచ్చిందంటూ కాంగ్రెస్ సభ్యులు అసహనాన్ని వ్యక్తం చేయగా, మసిబూసి మారడుకాయ చేశారంటూ కమలనాధులు, కమ్యూనిస్టులు మండిపడ్డారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ధ గురువారం తెలంగాణ శాసనమండలి కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ, సభ్యులు ఆవుల లలిత, ఫరూక్ హుస్సేన్‌లు మాట్లాడుతూ గవర్నర్ ప్రసంగంలో పసలేదని, ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించలేదని విమర్శించారు. నీటి పారుదల ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నామంటూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం భుజాలెగరేసుకుని భజన చేస్తోందే తప్ప, ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ హయంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఈ ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు జరిగాయని వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు టిఆర్‌ఎస్ పార్టీ ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకలేకపోయిందని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలర్పించి అమరులైన కుటుంబాలకు ఏమీ చేయలేదని, 29 అమరవీరుల కుటుంబాల చిరునామాలు దొరకటం లేదని అధికారులు చెప్పటం, కేవలం తప్పించుకునే ప్రయత్నమేనన్నారు. 101 అబద్దాలు చెప్పి గద్దెనెక్కిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా టిఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
ఉగ్రవాదులకు అడ్డాగా మారిన నగరం: లక్ష్మణ్
టిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని బిజెపి తెలంగాణ శాసన సభ పక్ష నేత డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. పోలీసు విభాగంలో ఎన్నో సంస్కరణలు చేశామని గొప్పగా చెప్పుకుంటున్నా, దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పట్టుబడినా, వారి మూలాలు హైదరాబాద్‌లోనే బయట పడుతున్నాయని, సర్కారు వైఫల్యం కారణంగా సిటీ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎన్వీవివిఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రరావులతో కలిసి మాట్లాడారు. ఉద్యోగులకు, జర్నలిస్టులకు ఇచ్చిన హెల్త్‌కార్డులు చెల్లని కార్డులుగా మారాయన్నారు. గురువారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం టిఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను చదివించినట్టు ఉందన్నారు. గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని నమ్మించి, ఇపుడు ఆ విషయాన్ని దాటవేస్తున్నారని మండిపడ్డారు. వాల్మీకి, బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని, ఎస్సీ, ఎస్టీలకు భూ పంపిణీ, కెజి టు పిజి ఉచిత విద్య వంటి కార్యక్రమాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని అన్నారు. బిసి సబ్ ప్లాన్ కోసం మాట్లాడుతూ బిసిల ఆశలపై నీళ్లు చల్లినట్టుందని వ్యాఖ్యానించారు.
రైతు ఆత్మహత్యలు పెరిగాయి
సిపిఎం, సిపిఐ ఎమ్మెల్యేల ధ్వజం
టిఆర్‌ఎస్ ప్రభుత్వ హయంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌లు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మీడియా పాయింట్ వద్ధ వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో తాగు,సాగు నీరు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇప్పటి వరకు దాదాపు 1600 మంది పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రభుత్వంలో చలనం లేదని విమర్శించారు. రైతులకు స్వతహాగా రుణాలిచ్చి, వారిని అన్ని రకాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ప్ల కార్డులు పట్టుకుని వస్తుంటే పోలీసులు అడ్డగించటం బాధాకరంగా ఉందన్నారు.