సంపాదకీయం

సేంద్రియ సమృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వయం సమృద్ధ గ్రామ వ్యవస్థను పునరుద్ధరించడానికి దేశవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. కొన్ని విజయవంతం అవుతుండడం నడుస్తున్న చరిత్ర. కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ ప్రాంతంలో అలతూరు మండలం ఇలాంటి విజయ విశ్వాసాలకు మరో ప్రతీక. ఎనిమిది గ్రామ పంచాయతీల సముదాయమైన ఈ మండల పంచాయతీలోని మొత్తం కూరగాయలు, పండ్లు సేంద్రియ సంప్రదాయ పద్ధతిలో పండిస్తుండడం వినూతన హరిత విప్లవం. సంకరజాతి విత్తనాలకు, వంగడాలకు, కృత్రిమ రసాయనపు ఎరువులకు, కృత్రిమ క్రిమిసంహార ఔషధాలకు ఈ ఈఎనిమిది గ్రామాల కర్షకులు స్వస్తి చెప్పడం అద్భుతమైన పరిణామం. గొమూత్రం, గోమయం ఉపయోగించడం ద్వారాను, ఇతర జీవ వైవిధ్య పద్ధతును పాటించడం ద్వారాను రసాయన విష కాలుష్యాలు లేని స్వచ్ఛమైన ఆ రోగ్యదాయకమైన కూరగాయలను పండ్లను ఈ గ్రామాలలో పండిస్తున్నారట. ఈ గ్రామాల ప్రజలు సేంద్రియ, ప్రాకృతిక ఫ లాలను, కూరగాయలను వినియోగిస్తున్నారు. బయటి నుండి దిగుమతులు ఆగిపోయాయి. ఇది మొదటి దశ. ఇలా సేంద్రియ పద్ధతిలో ఉత్పత్తి అవుతున్న కూరగాయలను, పండ్లను తమ పండ్ల పంచాయతీకి ఆవల ఉన్న గ్రామాలకు ఎగుమతి చేస్తుండడం నడుస్తున్న రెండవ దశ. మూడవ దశలో రాష్ట్రంలోని దూర ప్రాంతాలకు సైతం ఎగుమతి చేయడానికి వీలుగా మరింతగా ఈ సేంద్రియ ఉత్పత్తులను పెంచనున్నారట. ఈ సేంద్రియ వ్యవసాయాన్ని స్వచ్ఛ్భారత్ ఉద్యమంతో అనుసంధానం చేయడం ద్వారా పరిసరాల ప్రక్షాళనకు కూడ ఈ మండల కర్షకులు కృషి చేస్తున్నారట. అనాదిగా మనదేశంలో కొనసాగిన సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం మానవాళి ఆరోగ్యాన్ని మాత్రమే కాక ఇతర జీవజాలాన్ని ప్రకృతిని పరిరక్షించడానికి దోహదం చేసింది. స్వయం సమృద్ధ గ్రామం నిరంతరం వికసించింది. ప్రగతి వికేంద్రీకరణకు, ప్రజల సమష్టి హితానకి స్వయం సమృద్ధ గ్రామాలు ప్రాతిపదికలయ్యాయి. ఈ వికేంద్రీకృత సామాజిక జీవన వ్యవస్థ విదేశీయుల దురాక్రమణ కొనసాగిన సమయంలో చిన్నాభిన్నం కావడం మొదలైంది. బ్రిటిష్ వారి పాలన ముగిసే నాటికి ఈ వికేంద్రీకృత వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమైంది. గ్రామ స్వరాజ్యం ఏర్పడాలన్నది స్వాతంత్య్ర సమరయోధుల సుందర స్వప్నం. ఈ గ్రామ స్వరాజ్యం స్వయం సమృద్ధ గ్రామం. గ్రామాల స్వయం సమృద్ధి నష్టం కావడం వల్లనే గ్రామీణ ప్రాంతాలనుండి పట్టణాలకు, నగరాలకు జనం వలస వెళ్లడం ఆరంభమైంది. నగరాలలో పట్టణాలలో విపరీతంగా జనం కేంద్రీకృతం కావడం వల్ల ఉత్పన్నవౌతున్న సమస్యలు కోకొల్లలు.
గ్రామాల స్వయం సమృద్ధి దెబ్బతినడానికి దారితీసిన విపరిణామాలలో ప్రధానమైనది సంప్రదాయ సేంద్రియ వ్యవసాయం అంతరించిపోవడం. గో ఆధార, అటవీ ఆధార వ్యవసాయం జరిగినన్నాళ్లు రైతులు తమ పంటలకు కావలసిన విత్తనాలను తామే తయారు చేసుకున్నారు. ఆవులను పశువులను అడవులను విచ్చలవిడిగా విధ్వంసం చేసిన ఫలితంగా ప్రాకృతిక పద్ధతిలో తయారయ్యే ఎరువులకు తీవ్రమైన కొరత ఏర్పడిపోయింది. పచ్చి ఆకులు, ఆవుపేడ, పశువుల పేడ, మన్ను వంటి ప్రాకృతిక పదార్ధాలతో తయారైన ఎరువులు వాడిన రోజులలో పంటలకు తెగుళ్లు అతి తక్కువగా వ్యాపించేవి. భూసారం నష్టమయ్యేది కాదు. కానీ ప్రాకృతికమైన ఎరువులకు కొరత ఏర్పడింది. కృత్రిమ రసాయనాలను ఎరువుల పేరుతో వాడడం మొదలైంది. ఈ కృత్రిమమైన రసాయనాలవల్ల భూసారం దెబ్బతినింది. ఈ రసాయనాల వాసనలు వానపాములను చంపేశాయి. భూమిని నిరంతరం పరిపోషించి సారవంతంగా ఉంచగలిగిన వానపాములు నష్టమై పోవడంతో భూమి తన సహజత్వాన్ని కోల్పోయింది. ఫలితంగా కృత్రిమ సారాన్ని సృష్టించడానికై రసాయనపు ఎరువులనను రెండింతలుగా మూడింతలుగా వాడవలసి వచ్చింది. దేశంలోని ఎరువులు చాలక విదేశాలనుండి భారీ ఎత్తున ఎరువులను దిగుమతి చేసుకుంటుండటం వర్తమాన వైపరీత్యం. మన వాణిజ్యం లోటు పెరగడానికి, రూపాయి విలువ తగ్గిపోతుండడానికి ఈ కృత్రిమ రసాయనాల దిగుమతి ఒక ప్రధాన కారణం. దేశంలోని అధికాధిక ప్రాంతాలలో పాలక్కాడు, అలతూరు ప్రాంతాలలో వలె సంప్రదాయ వ్యవసాయాన్ని పునరుద్ధరించడం వల్ల దేశాన్ని దివాలా తీయిస్తున్న వాణిజ్యం లోటు అంతరించగలదు...సంప్రదాయ వ్యవసాయాన్ని పునరుద్ధరించడానికి గోవంశ పరిరక్షణ, అడవుల విస్తరణ అనివార్యం.
హరిత విప్లవం పేరుతో విరుచుకొని పడిన సంకరజాతి రకాల విత్తనాలు, వంగడాలు వ్యవసాయాన్ని వాణిజ్య సంస్థల దురాక్రమణకు మరింతగా గురి చేశాయి. సేంద్రియ ప్రాకృతిక పద్ధతిలో అనాదిగా సేద్యం చేసిన రైతులు కోతకు వచ్చిన తమ పంటనుండి తదుపరి పంటకు అవసరమైన విత్తనాలు సేకరించుకునేవారు. అందువల్ల విత్తనాలను కొనుగోలు చేయడానికై వారు వందలు వేల రూపాయలను వెచ్చించవలసి వచ్చేది కాదు. ఈ ప్రాకృతిక పద్ధతి మూలపడి, హైబ్రిడ్ విత్తనాలను కొనుగోలు చేయవలసిన దుస్థితి దాపురించింది. ఎందుకంటె హైబ్రిడ్ విత్తనాల ద్వారా పండే గింజలు విత్తనాలుగా పనికిరావు. ప్రతి పంట ను వేయడానికి కొత్తగా హైబ్రిడ్ విత్తనాలను కొనవలసిందే. వ్యవసాయం ఖర్చులు పెరగడానికి వాణిజ్య సంస్థలు,దళారీ ముఠాలు రైతులను దోచుకొనడానికి దారితీసిన విపరిణామం ఇది. ఈ దశలో విదేశీయ బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు రంగప్రవేశం చేసి అన్నదాతలను మరింతగా కొల్లగొట్టాయి, కొల్లగొడుతున్నాయి. హైబ్రి డ్ వ్యవసాయం వల్ల దిగుబడులతోపాటు, పంటలను ధ్వంసం చేసే చిత్రవిచిత్రమైన క్రిములు, కీటకాలు పెరిగిపోవడం కూడ దశాబ్దుల చేదు అనుభవం.. క్రిములను కీటకాలను చంపి పంటలను కాపాడడానికై విదేశాలనుండి, దేశంలోని విదేశీయ సంస్థలనుంచి దిగబడిన రసాయనాలు, పంటలను కలుషితం చేయడం మరో వైపరీత్యం. ఎండోసల్ఫాన్ వంటి క్రిమినాశకాలను వాడిన పంటలను తిన్నవారు చిత్ర విచిత్ర రోగాలకు గురి అవుతున్నారని అధ్యయనాలలో ధ్రువపడింది. భూమి స్వభావం కూడ వికృతమైపోయింది. ఫలితంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి...
అందువల్ల దిగుబడులను మరింతగా పెంచే పేరుతో దాపురించిన, దాపురిస్తున్న మహా సంకరజాతి-జెనిటికల్లీ మాడిఫైడ్-జిఎం-విత్తనాలు వంగడాలు వ్యవసాయాన్ని మరింతగా వాణిజ్యానికి బానిసగా మార్చివేస్తున్నాయి. మోన్‌సాంటో వంటి విదేశీయ సంస్థలు ఏళ్లతరబడి భయంకరమైన ధరలకు పత్తి విత్తనాలను అమ్మాయి. ఇప్పటికీ కిలో పత్తివిత్తనాల ధర రెండువేల రూపాయలకు పైగానే ఉంది. తెలంగాణలోను ఇతర చోట్ల ఈ విత్తనాల ధరలను తగ్గించడానికి ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలను బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ప్రతిఘటిస్తున్నాయి. ఈ మహాసంకర జాతి విత్తనాలలో తయారవుతున్న ‘బిటి’ రసాయనం కొత్త రోగాలను సృష్టిస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తోంది. పంజాబ్‌లో పనె్నండు లక్షల ఎకరాలలోని పత్తిపంటను గత అక్టోబర్‌లో తెల్ల ఈగలు ధ్వంసం చేశాయి. తెలంగాణలో ఇప్పుడు గులాబీ రంగు పురుగులు పత్తిపంటను నాశనం చేస్తున్నాయట. సేంద్రియ వ్యవసాయం మూలపడినందువల్ల దశాబ్దులుగా జరుగుతున్న అనర్ధాలు ఇవన్నీ...ఈ విపత్తును అధిగమించడానకకి పాలక్కాడ్-అలతూరు చేస్తున్న కృషి అభినందనీయం.