Others

మాతారాధనే మహోన్నతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృదేవోభవ, పితృదేవోభవ
ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ
తల్లినే ఆరాధ్యదేవతగా చేసుకో, తండ్రినీ ఆరాధ్యదేవతగా చేసుకో, గురువునీ ఆరాధ్యదేవతగా చేసుకో- అతిథినీ ఆరాధ్యదేవతగా చేసుకో అని.
ఈ ఉత్తమ ఆశయాన్ని పిల్లలకు ఉపదేశించే ఆచారం కేవలం భారతదేశంలోనే కాక యూరోప్, అరేబియా, ఆఫ్రికా, అమెరికా ఖండ దేశాలలోనూ అమలులో ఉంది. స్ర్తిని, ప్రతి స్ర్తినీ, జీవితాంతమూ జీవన సహచరిగా, భార్యగా ఉండదలచుకొని నీతో కలిసి ఉంటున్న స్ర్తిని దేవతగానే భావిస్తూ ఆమెలోని సహజమైన ప్రేమను, మాతృత్వాన్ని పరమ పవిత్రంగా ఆరాధించాలి- అని ఐదేళ్లు నిండి వ్యవహారిక జగత్తులోకి అడుగుపెడుతున్న ప్రతి బాలుడికీ ‘ఉపనయన’ సంస్కారం జరిపి ఉత్తముడైన గురువు వద్ద విద్య నేర్వడానికై వదలిపెట్టే సమయంలో ప్రప్రథమంగా పనిచేసే ఉపదేశం- అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలలోనూ స్ర్తి దేవత ఆలయాలుగా అమ్మవారి ఆలయాలు విస్తారంగా వెలసి ఉండడంతో అంతటా అమ్మవారి ఆరాధన, స్ర్తిని దేవతగా భావిస్తూ ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధించడం జరుగుతుండేది. కాని ఐదువేల ఏళ్ళ క్రితం, మహాభారత యుద్ధానంతరం 32 ఏళ్లకు ప్రారంభమైన కలియుగ లక్షణంగా (క్రీస్తు పూర్వం 3102లో కలియుగ ప్రారంభం) ప్రపంచ వ్యాప్తంగా స్ర్తిల ఆరాధన అడుగంటి పురుషులే అధిక శక్తివంతులుగా ప్రకటించుకొని బహుళ ప్రచారంలోనికి తేవడం జరిగింది. అంతేకాక దైవభావన పట్ల నిరసన, విగ్రహాల ఆరాధన పట్ల వ్యతిరేకత క్రమంగా పెరగడంతో పశ్చిమ దేశాలన్నింటిలోనూ స్ర్తి దేవతల ఆలయాలను అన్నింటినీ కూలగొట్టి, తర్వాత కొన్నాళ్లకు పురుష దేవుళ్ళ ఆలయాలను నిర్మించి ఆరాధించడం ప్రారంభం అయింది. భారతదేశంలో సైతం ఈ స్ర్తి వ్యతిరేకత ఉద్యమ ప్రభావం కొంత కానవచ్చినా అమ్మవారి ఆరాధన- గంగాభవాని, పార్వతి, లక్ష్మి, సరస్వతి రూపాల్లో విస్తారంగానే కొనసాగుతూ వచ్చింది. అలా స్ర్తిల ప్రాముఖ్యం విస్తృతమై, స్ర్తిలను దేవతలుగా ఆరాధించే సాంఘిక దృక్పథమే మరుగున పడిపోయింది. మరి స్ర్తిలను తల్లులుగా, మాతృదేవతలుగా ఆరాధించడం మరచి, వారిని తమ సేవకులుగా భావిస్తూ స్వార్థంతో వారి జీవితాలను కొల్లగొట్టడం దానవ లక్షణం. కనుక మాతృరాధనయే మహోన్నతమని ఎరిగి మరలా స్ర్తిలు పూజింపబడితేనే భూతలం స్వర్గం కాగల్గుతుంది.

- సన్నిధానం యజ్ఞనారాయణమూర్తి