AADIVAVRAM - Others

కోటికి ఒక్కడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడ్పల్‌లోని ప్రాథమిక పాఠశాల ముందు బైక్ ఆపాడు మోహన్.
‘కొత్త సార్.. కొత్త సార్’ అంటూ పిల్లలు కేకలు పెడుతూ మోహన్ సార్ చుట్టూ మూగారు.
‘హుష్.. ఏయ్.. అల్లరి వద్దూ’ అని పాఠశాల ఆఫీస్‌లోనికి వెళ్లాడు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్‌రెడ్డి విష్ చేసి మోహన్‌ను కూర్చోమని కుర్చీ చూపాడు. కూర్చుంటూనే మండల విద్యా శాఖాధికారి ద్వారా తెచ్చిన సర్క్యులర్ తన గురించి ప్రచురణ పొందిన పేపర్ కటింగ్స్ సుధాకర్‌రెడ్డి సార్ చేతికందించాడు.
సర్క్యులర్, పేపర్ కటింగ్స్ చూసిన హెచ్‌ఎం ‘సంతోషం సార్. మీరు రిటైర్ అయిన తర్వాత స్వచ్ఛందంగా స్కూల్‌కు వచ్చి కథలు, పాటలు, పద్యాలు వినిపించడం అభినందనీయం’ అనగానే,
‘ఇప్పటికి 245 పాఠశాలల్లో 19 మండలాలు, 8 జిల్లాల్లో నా ‘బాల వికాస యాత్ర’ కార్యక్రమం నిర్వహించాను. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్’గా గుర్తింపు వచ్చింది’ అని చెబుతూనే జేబులోని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ హోల్డర్‌గా గల ఐ.డి కార్డుని తీసి చూపాడు.
‘అలాగా.. మరీ మనమెప్పుడు ప్రోగ్రామ్ నిర్వహిద్దాం’
‘శుభస్య శీఘ్రం’ అన్నారు పెద్దలు. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే?’
‘ఐతే పిల్లలు ఇంటర్వెల్‌కి వెళ్లి వచ్చిన తరువాత మొదలుపెడదాం’ అంటూనే.. కాలింగ్ బెల్ నొక్కాడు హెచ్.ఎం.
అటెండర్ రాగానే బెల్ కొట్టమని చెప్పాడు. బెల్ కొట్టడంతో గోలగోలగా ఇంటర్వెల్‌కి వెళ్లి వచ్చారు పిల్లలు.
హెచ్.ఎం. ఆదేశం మేరకు మేడమ్‌లు, సార్లు పిల్లలను గ్రౌండ్‌లో కూర్చోబెట్టారు.
గ్రౌండ్ చుట్టూ చెట్లు. చెట్ల మధ్యన అక్కడక్కడ కూర్చుండి పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయులకు గద్దెలు నిర్మించారు. ఈ గద్దెలు పిల్లలకు కూడా చదువుకోవడానికి, రాసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.
ఆ ప్రాంతాన్ని చూస్తుంటే రవీంద్రనాథ్ టాగూర్ శాంతినికేతనంలా కనిపించింది మోహన్ సార్‌కి.
ముందుగా హెచ్.ఎం. మాట్లాడుతూ ‘మోహన్ సార్ కథలు చెప్పడంలో దిట్ట. అట్లే రాగయుక్తంగా పాటలైనా, పద్యాలైనా పాడతారు. వాటి అర్థాన్ని కూడా పల్లీలు వలిచిపెట్టినట్లుగా చెబుతారు. అటువంటి సార్ మన స్కూల్‌కు రావడం మన అదృష్టం’ అని చెప్పి మిగతా ఉపాధ్యాయ, ఉపాధ్యాయినీలను మాట్లాడమని చెప్పాడు హెచ్.ఎం.
కాని, వారెవరూ మాట్లాడక ‘మోహన్ సార్ గారిని కార్యక్రమం కొనసాగేట్లు చేయమని’ చెప్పారు.
హెచ్.ఎం సైగతో అప్పటివరకూ కూర్చున్న మోహన్ లేచి, తనను తాను పరిచయం చేసుకుని కార్యక్రమంలోకి వెళదాం అంటూ ‘పద్యం రస నైవేద్యం. పద్యం తెలుగు వాళ్ల సొత్తు. పద్యానికి ఉన్న ఛందస్సు, యతి ప్రాసలవల్ల రాగయుక్తంగా చదవడానికి వీలవుతుంది.
ఒక్కొక్క పద్యం ఒక్కో బంగారు తునక. నీతిచంద్రిక రాయదలచుకుంటే ఒక పద్యం గురించే ఒక నోట్‌బుక్ రాయవచ్చు. ధర్మం - అధర్మం, మంచి- చెడులను మానవతా విలువలను విడమరిచి చెబుతాయి పద్యాలు.
అందుకే ప్రతి వ్యక్తి విధిగా పద్యాలు కంఠతా నేర్వాలి. అలాగే సామెతలు, సూక్తులు, జాతీయాలు తెలుసుకోవాలి’ అని చెప్పి ‘దొరలు దోచలేరు’ ‘అనగననగ రాగమతిశయిల్లుచునుండు’ అనే పద్యాలను రాగయుక్తంగా చదివి వినిపించారు. వాటి అర్థాన్ని విడమరిచి చెప్పడమేకాక ఎన్నో ఉదాహరణలు కూడా తెలిపారు.
అనంతరం ఐదారు పాటల వరకు విద్యా విషయక వివరణలకు సంబంధించినవి రాగయుక్తంగా అభినయంతో పిల్లలను అభినయింపజేస్తూ పాడిస్తూ పాడారు.
పిల్లలు మైమరచిపోయి సందర్భోచితంగా చప్పట్లతో ఆనందించారు.
పాటలే కాక, ‘జోస్యం’ ‘నత్తి’ ‘నక్క’ అనే కథలను కూడా అభినయంతో చెప్పారు. మధ్యమధ్య పిల్లలను కతలలో మమేకమయ్యేట్లు చేయడం మోహన్ సార్ ప్రత్యేకత. ఈ కారణంగానే పిల్లలు సూది క్రింద పడ్డా వినపడేంత నిశ్శబ్దంగా ఉన్నారు. ఈ కార్యక్రమం గంట వరకు కొనసాగింది. ‘బాల వికాస యాత్ర’ ముగిసిన తర్వాత హెచ్.ఎం. చరిత అనే అమ్మాయిని పిలిచి ‘ఇప్పుడు సార్ చెప్పిన కథలలో నీకు నచ్చిన కథ’ చెప్పమన్నారు.
‘జోస్యం’ అనే కథను మోహన్ సార్ చెప్పినట్లు ఒక్క పదం కూడా తప్పిపోకుండా అభినయిస్తూ చెప్పడం అక్కడి సార్లకు, మేడమ్‌లకు, పిల్లలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ముఖ్యంగా ఆ కథ చెప్పే విధానానికి ముగ్ధుడైన మోహన్ సార్ ‘శభాష్’ అని ప్రశంసించి తన జేబుకున్న పెన్నును చరితకి అందజేశారు. ఇది చూసి అందరూ కరతాళ ధ్వనులు చేశారు.
అనంతరం హెచ్.ఎం. ప్రసంగిస్తూ ‘నూటికో కోటికో ఒక్కరు. అది మీరేమీరే మాస్టారు’ అన్న సినీ గీతాన్ని ఆలపించి ‘ఇది నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు విన్నాను. ఇలాంటి టీచర్లు కూడా ఉంటారా? ఇది అతిశయం మాత్రమే అనుకున్నాను. ఈ సార్‌ని చూసిన తర్వాత అది నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది.
ఈ కార్యక్రమం ఉపాధ్యాయులకు స్ఫూర్తిగాను, విద్యార్థులకు మానసిక శారీరక వికాసానికి దోహదపడుతుంది’ అని ముగించారు.

-ఎన్నవెళ్లి రాజవౌళి