Others

హీరోయిన్లపై గాసిప్పులు కామనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనపై ఎక్కడలేని గాసిప్స్ పోగేసి రాసేవారని -కొద్దికాలంగా అలాంటి బాధ తప్పిందని తెగ ఆనందపడుతోంది అనుష్క. పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో తనపై ఎన్ని పుట్టించాలో అన్నీ పుట్టించేసి రాసేశారట. అయితే, వాటికి ఏరోజూ స్పందించలేదని గుర్తు చేస్తోంది అందాల తార అనుష్క. క్రమంగా తన ప్రవర్తనను అర్థం చేసుకున్న వాళ్లు -ఇప్పుడు గాసిప్పులు రాయడం మానేశారని కూడా అంటోంది. ఖైదీ.. 150లో వచ్చిన చాన్స్‌ను కాల్షీట్ల సమస్యతో వదులుకుందని.. అయినా చిరు తరువాతి చిత్రంలో అనుష్కే హీరోయిన్ అన్నట్టు వస్తున్న కథనాలకు పైవిధంగా స్పందించింది ఆమె. అయితే, కెరీర్‌కు సంబంధించిన గాసిప్పులైతే ఓకేనట. కానీ ఏవేవో రాసేస్తే ఎలా అంటోంది? ఏదోకవిధంగా వార్తల్లో ఉంటేనే హీరోయిన్లకు చాన్స్‌లొచ్చే రోజులు కనుక -తనపై గాసిప్పులు తగ్గడంతో ఆమె ఆందోళన చెందుతోందా? నిజంగానే ఆనందిస్తోందా? అని డౌటు పడేవాళ్లూ లేకపోలేదు. ఆమె స్టేట్‌మెంట్లు చూస్తుంటే -కొన్ని రూమర్లైనా పుట్టించి కెరీర్ స్పాన్ పెంచమని కోరుతున్నట్టే ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కెరీర్‌పరమైనవైనా, కాదా అన్నది పక్కన పెడితే -హీరోయిన్లపై గాసిప్పులు కామనేనన్నది అనుష్కకు తెలీందేమీ కాదు. ఏమంటారు?