Others

నాకు నచ్చిన పాట-- నేడు శ్రీవారికి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు శ్రీవారికి మేమంటే పరాకా.../ తగని భలే చిరాకా.. ఎందుకో.. తగని భలే చిరాకా.. -ఇల్లరికం సినిమాలోని ఈ పాట నాకు చాలా ఇష్టం. సాధారణంగా ప్రేమలో ఉన్నపుడు యువతులను ప్రసన్నం చేసుకోడానికి యువకులు వారు కోరినదల్లా ఇవ్వడం, వదలకుండా వెంట తిరగడం పరిపాటి. భార్యాభర్తలయిన తరువాత ఉద్యోగ బాధ్యత కావొచ్చు, కుటుంబ నిర్వహణలో ఇబ్బందులవల్లో అదే ధోరణి కొనసాగించకపోతే స్ర్తిలు అపార్థం చేసుకుని భర్తలపై అలగడం, వారిని మాటలతో సతాయించడంలాంటి సన్నివేశాలు ఆ’పాత చిత్రాల్లో అద్భుతంగా చిత్రీకరించేవారు. 1959లో విడుదలైన ‘ఇల్లరికం’ సినిమాలో ఆరుద్ర ఈ పాట ద్వారా అదే విషయాన్ని మరింత మురిపెంగా చెప్పడం ఆకట్టుకుంటుంది. ‘నేడు శ్రీవారికి మేమంటే పరాకా.. తగని భలే చిరాకా.. అంటూ మొదలుపెడుతుంది కథానాయకి. -‘మొదలు మగవారు వేస్తారు వేషాలు/ పెళ్లికాగానే చేస్తారు మోసాలు’ అంటూ దెప్పిపొడిచే భార్య మనోభావాలను సవరిస్తూ ‘వారి మనసైతే వస్తారు ఆడవారు/ చేర రమ్మంటే రానే రారు’ అంటూ చమత్కరిస్తాడు కథానాయకుడు. అక్కడితో ఆగిపోతే ఆడవారు ఎందుకు అవుతారు. వెంటనే మూతి ముడుస్తూ ‘తెలుసుకున్నారు స్ర్తిల స్వభావాలు/ తెలిసి తీర్చారు ముద్దుమురిపాలు’ అనడంతో ఇక భర్తల దారి ‘రాజీదారి’ అని గ్రహించే తెలివైన మగవాడు ‘అలుక సరదా మీకు/ అదే వేడుక మాకు, కడకు మురిపించి గెలిచేది మీరేలే’ అని సర్దుబాటు ధోరణితో మెత్తపరచడంతో చల్లబడిన భార్య ‘ప్రణయ కలహాల సరసాలే వినోదం/ తగువే భలే వినోదం’ అంటూ భర్తతో శృతి కలపడం సంసారరథం సాఫీగా సాగిపోయే సోపానం. నిజ జీవితంలో మాటలరూపంలో సాధారణంగా కనిపించే ఇలాంటి భావనలు రచయిత పాట ద్వారా చెప్పిన దానిని సంగీత దర్శకుడు చలపతిరావు స్వరపరచిన తీరు, ఘంటసాల-సుశీల పాడిన వైనం, ఏఎన్నాఆర్, జమున అభినయించిన విధానం మధురం. కనుకనే ఈ పాట నేటికీ ప్రేక్షకులను అలరిస్తూ మురిపిస్తోంది, ప్రణయ కలహ చిలిపి గీతంలా.

- సుసర్ల సర్వేశ్వరశాస్ర్తీ, విశాఖపట్నం