Others

అన్నా.. నీ అనురాగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో అన్నాచెల్లెళ్ల అనుబంధం -ప్రపంచంలోకెల్లా ఉన్నతమైంది. అందుకే భారతీయ సినిమా రంగంలో దీనికి విశేష ప్రాధాన్యత
లభించింది. అన్న చెల్లెళ్ల అనుబంధమే ప్రధాన ఇతివృత్తంగా ఎన్నో చిత్రాలొచ్చాయి. అధిక శాతం విజయం సాధించాయి. తొలి చిత్రంగా 1953లో వచ్చిన ‘నా చెల్లెలు’ టైటిల్‌బట్టి అనుకోవచ్చు. తర్వాత 1960లో వచ్చిన ‘అన్నా చెల్లెలు’.
సాధారణంగా చాలా తెలుగు సినిమాల్లో అన్నా చెల్లెలు, అక్కా తమ్ముడు పాత్రలు
ఉంటూవుంటాయి. కానీ ఇక్కడ ప్రస్థావన అన్నా చెల్లెలు కీలకమైన ప్రధాన పాత్రల కధాంశంతో వచ్చిన చిత్రాల తీరుతెన్నుల గురించి. వాటిని పోషించిన నటీనటుల ఆసక్తి నట సామర్థ్యం గురించి ఒక్కసారి గుర్తు చేసుకుందాం.

ఈ చిత్రాల్లో పాత్రల మధ్య ప్రధానంగా అనుబంధం, సంఘర్షణ, త్యాగాలు, ఎమోషన్స్, సెంటిమెంట్ సన్నివేశాలు ప్రాముఖ్యత కలిగి ఉండేవి. అక్కాతమ్ముళ్ల అనుబంధం ప్రధానాంశంగా 1955లో ‘సంతానం’ చిత్రం వచ్చింది. శ్రీరంజని, అక్కినేని, చలం ప్రధాన పాత్రదారులు.
ఏఎన్‌ఆర్, ఎన్‌టిఆర్ తరంలో అన్నా చెల్లెళ్ల ప్రధానాంశంతో వచ్చిన చిత్రాలు, చెల్లెలు పాత్రలు ధరించిన నటీనటుల గురించి తెలుసుకుందాం. చాలా చిత్రాల్లో ప్రేమికులుగా మెప్పించిన ఎన్టీ రామారావు, సావిత్రిలు -1962లో ‘రక్తసంబంధం’తో అన్నాచెల్లెళ్లుగా అద్వితీయ నటనతో శెభాష్ అనిపించుకున్నారు. -1964లో అక్కినేని, సావిత్రి అన్నాచెల్లెలి వరుస పాత్రల్లో కనిపించి ‘డాక్టర్ చక్రవర్తి’తో ‘సువర్ణ’ విజయం అందుకున్నారు.
అన్నగా ఎన్టీఆర్..
1963లో ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’లో బి సరోజాదేవి చెల్లెలుగా ప్రధాన పాత్ర పోషించారు. ‘ఆడపడుచు’ (1967)లో చంద్రకళ, ‘నిండుసంసారం’ (1968)లో అనిత, ‘విజయం మనదే’ (జానపదం- 1970)లో దేవిక, ‘చిట్టి చెల్లెలు’ (1970)లో వాణిశ్రీ, ‘పల్లెటూరి చిన్నోడు’ (1974), ‘ఆరాధన’ (1976) చిత్రాల్లో విజయలలిత, ‘అడవిరాముడు’, ‘ఎదురీత’ చిత్రాల్లో జయసుధ, ‘డ్రైవర్ రాముడు’ (1979)లో రోజారమణి, ‘మహాపురుషుడు’ (1982)లో సుజాత, ‘చండశాసనుడు’ (1983)లో శారద -ఎన్టీఆర్‌కు చెల్లెళ్లుగా కనిపించి మెప్పించారు.
అన్నగా ఏఎన్నార్..
‘దొంగరాముడు’ (1955)లో జమున, ‘అభిమానం’ (1960)లో కృష్ణకుమారి, ‘ఇద్దరు మిత్రులు’ (1961)లో శారద, ‘అంతస్తులు’ (1965)లో భానుమతి (అక్కగా), ‘పూలరంగడు’ (1967), ‘బంగారు గాజులు’ (1968), ‘హేమాహేమీలు’ (1979)లో విజయనిర్మల, ‘ఆత్మీయులు’ (1969)లో చంద్రకళ, ‘్ధర్మదాత’ (1970)లో ఝాన్సీ, ‘అమాయకురాలు’ (1971)లో శారద, ‘దత్తపుత్రుడు’ (1972)లో వెన్నిరాడై నిర్మల, ‘బంగారు బాబు’ (1973)లో జయంతి, ‘బంగారు కలలు’ చిత్రంలో వహీదా రెహమాన్, ‘దొరబాబు’ (1974)లో చంద్రకళ -ఏఎన్నార్‌కు చెల్లెలి పాత్రలు పోషించి మెప్పించారు. తోబుట్టువుల మధ్య అనుబంధాన్ని పరిణితి చెందిన నటనతో మెప్పించి అఖండ విజయాలు అందుకున్నారు కూడా. అన్నా చెల్లెలి అనుబంధం ఇతివృత్తంగా వచ్చిన దాదాపు అన్ని చిత్రాల్లో సెంటిమెంట్‌తో కూడిన హిట్ పాటలే ఆయా సినిమాలకు ఒకింత ప్రాణం పోశాయి. ఆ రోజుల్లోనే థియేటర్లకు రిపీటెడ్ ఆడియన్స్‌ను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి. ఎన్టీఆన్, ఏఎన్నార్‌ల తరువాత -కృష్ణ, శోభన్‌బాబు తదితర హీరోలు సైతం అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్‌తో కూడిన చిత్రాలు చేసినా గొప్ప హిట్లుగానీ, గుర్తుంచుకోదగిన పాటలుగానీ క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
1968 కృష్ణ ‘చెల్లెలి కోసం’, శోభన్ బాబు ’బంగారు చెల్లెలు (1979) చిత్రాల్లో శ్రీదేవి చెల్లి పాత్ర పోషించింది. ‘పుట్టినిల్లు మెట్టినిల్లు’ చిత్రంలో కృష్ణ చెల్లిగా లక్ష్మి, ‘మంచి మిత్రులు’ చిత్రంలో విజయనిర్మల, ‘దేవుడు చేసిన మనుషులు’ (1973)లో ఎన్టీఆర్, కృష్ణ చెల్లిగా కాంచన, ‘మాయదారి మల్లిగాడు’లో జయంతి అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చూపించిన చిత్రాల్లో ముఖ్యమైనవి.
**
ఆధునిక సినిమా కాలంలోకి అడుగుపెట్టిన తరువాత -అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని చూపిస్తూ నొటికో కోటికో సినిమా వస్తున్నా స్వర్ణయుగం కాలంనాటి సినిమాలంతటి ఆదరణ పొందలేకపోయాయి. ఆనాటి చిత్రాల్లో అన్న చెల్లెలు పాత్రలు కరుణరసపూరితంగా, త్యాగమయ పాత్రలతో సెంటిమెంటు ప్రధానంగా ఉండేవి. చిత్రం ఏమిటంటే -ప్రేయసిగా నటించిన పాత్రధారులే చెల్లెలిగా స్క్రీన్‌పై కనిపించినపుడు -చెల్లెలు అన్న భావనే కలిగేది. ఇప్పుడు అంత ఉన్నతంగా సినిమాను తీయగలిగేవారూ లేరు, తీస్తే చూసేవారూ లేరన్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి సాంకేతిక యుగంలోకి అడుగుపెట్టిన తరువాత -అప్పటి అనురాగాలు, అనుబంధాలు కరవైపోయాయని అనేవాళ్లూ లేకపోలేదు. అన్నా చెల్లెళ్ల అనురాగం, అనుబంధంలోని తియ్యనిదనాన్ని చవిచూడాలంటే -సిడీలు తెచ్చుకునో, డౌన్‌లోడ్ చేసుకునో పాత సినిమాలు చూడాల్సిందే.

-పివిఎస్ ప్రసాదరావు