Others

ప్రాణాలు తీస్తున్న ‘వాయువు’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో వాయు కాలుష్యం విషమించడంతో వ్యాధుల బారినపడి ఏటా పనె్నండు లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం విజృంభిస్తున్న తీరుపై ‘గ్రీన్‌పీస్ ఇండియా’ అనే సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో అనేక ఆందోళనకర విషయాలు వెలుగు చూశాయి. వివిధ రాష్ట్రాల్లోని కాలుష్య నియంత్రణ బోర్డుల నుంచి సమాచార హక్కు చట్టం కింద వివరాలను రాబట్టి ఈ నివేదికను ‘గ్రీన్‌పీస్ ఇండియా’ విడుదల చేసింది. పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 168 నగరాల్లో వాయు కాలుష్యం తీరుతెన్నులను ఈ సంస్థ అధ్యయనం చేసింది. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ ప్రమాణాలకు పూర్తి విరుద్ధంగా ఈ 168 నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు అధ్యయనంలో తేల్చారు.
ధూమపానం వల్ల కూడా వాయు కాలుష్యం పెరుగుతూ ఎంతోమంది అనారోగ్యంతో అవస్థలు పడుతున్నారు. పట్టణాలు, నగరాల్లో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో వాయు కాలుష్యం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోడ్లపై వెళ్లేవారు ముఖాలకు ‘మాస్క్’లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాయు కాలుష్యం ఫలితంగా ఎంతోమంది రోగాల బారిన పడడంతో వైద్యం కోసం వారు ఎంతో ఖర్చు చేయాల్సి వస్తోంది. మానవ వనరులపైనా దీని ప్రభావం పడుతున్నందున స్థూల జాతీయోత్పత్తిలో మూడు శాతం మేరకు నష్టం జరుగుతోంది.
దక్షిణాది రాష్ట్రాల్లోని నగరాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండగా, ఉత్తరాదిలో మాత్రం కాలుష్య మేఘాలు దట్టంగా ఆవరిస్తున్నాయి. దేశం మొత్తమీద చూస్తే దిల్లీ నగరంలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. ఇక్కడ వాయు కాలుష్యం ప్రమాదస్థాయిని మించి పోవడంతో ఇటీవల పాఠశాలలకు సెలవులు సైతం ప్రకటించారు. పరిసరాలు ‘పొగ చూరిపోవడం’ అనే సమస్య దేశ రాజధానికే పరిమితం కాలేదు. మరెన్నో ఉత్తరాది నగరాలనూ వాయు కాలుష్యం వేధిస్తోంది. బరేలి, ఘజియాబాద్, అలహాబాద్, ఫరీదాబాద్, ఆగ్రా వంటి నగరాలు కాలుష్యంతో విలవిలలాడుతున్నాయి. యమునా నదీ తీరంలో లెక్కకుమించి రసాయన పరిశ్రమలు యథేచ్ఛగా విషవాయువులను వదులుతున్నందున నదీ జలాలు కలుషితమవుతున్నాయి. వాయు కాలుష్యం కారణంగా అద్భుత కట్టడమైన ‘తాజ్ మహల్’ కళావిహీనమవుతోంది. వాయు కాలుష్యానికి డీజిల్, పెట్రోల్, బొగ్గు వంటివి కారణమవుతున్నాయి. ఈ పరిస్థితులను నివారించేందుకు ప్రభుత్వాలు, పౌరసమాజం ఇకనైనా మేల్కొనాలని, లేకుంటే భవిష్యత్‌లో పరిస్థితి మరింత భీతావహంగా ఉంటుందని ‘గ్రీన్‌పీస్ ఇండియా’ హెచ్చరించింది. భారతీయ నగరాల్లో కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఓ) ప్రమాణాలకు 13 రెట్లు, జాతీయ నాణ్యతా ప్రమాణాలకు 5 రెట్లు అధికంగా ఉన్నాయి. దేశం అభివృద్ధి పథంలో ప్రయాణించాలంటే- ప్రజల ఆరోగ్యాన్ని కబళిస్తున్న వాయు కాలుష్యం సమస్యను అధిగమించాల్సి ఉంది.
*