Others

ఎన్నికల టైమ్‌లోనే ఆ స్కూళ్లు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాఖండ్ చిత్రమైన రాష్ట్రం. అక్కడి ‘్ఫతోర్‌ఘడ్’ జిల్లాలోనూ చంపావతీ జిల్లాలోనూ ఒక యాభై దాకా దెయ్యాల స్కూళ్లున్నాయి. అంటే పిల్లలు రాక వాటిని మూసేసి వుంచుతారు గానీ ఎన్నికల టైమ్‌లో అంటే ఐదు ఏళ్లకోసారి, స్కూలు తలుపులు తెరిచి, బూజులు దులుపుతారు.
ఉదాహరణకి ఇండో-నేపాల్ సరిహద్దులనానుకుని వున్న ‘్ధర్‌చూలా’ తాలూకా బోనా గ్రామంలో పాడు పెట్టబడి వున్న బడి ఒకదాన్ని తెరిచారు. కేవలం 632 మంది ఓటర్ల కోసం 2013 తరువాత మళ్లీ యిప్పుడు రుూ భవనం తెరిచారు. భూలాగాఁవ్ దిద్దీహట్ గ్రామంలో స్కూలు తెరచుకుంది. ‘అదాలి’, ‘మాఝేర్’ లాంటి గ్రామాల్లో వోటర్లే ఐదారు వందలమంది మిగిలారు. ఒకప్పుడు ఐదారు వందల మంది పిల్లలుండేవారు. ఈ గ్రామాలలో పెద్దలు ఉపాధి లేక వలసపోయారు. మరి పిల్లలలెక్కడినుంచొస్తారు? వోటర్లే బ్రతిమాలి, బామాలితేగాని రాదు. పిల్లలు వుండరు. కాని స్కూల్ గ్రాంట్ వుంటుంది. గవర్నమెంట్ జీతాలు అందుకునే గడుసు టీచర్లుంటారు కొన్ని గ్రామాలలో- అంటే వీటిని క్యాష్‌లెస్ పోలింగు ‘బూతులు’ అనొచ్చును.
అయితే ఉత్తరాఖండ్ తీర్థయాత్రల, మంచుకొండల రాష్ట్రం. పంచావత్‌లోనే ‘కూర్మావతారం’ జరిగిందట. మొత్తం అసెంబ్లీ సీట్లు 70 కావటంతో అందులో 15 రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు గొప్పే! కాకపోతే అక్షరాస్యత 90 శాతం వుంది. నిరుద్యోగుల సంఖ్య అపారం. డెహ్రాడూన్ ముఖ్యనగరం. కాని స్కూళ్లల్లో పిల్లలు కావాలీ అంటే పెద్దలకి గ్రామాల్లో ఉపాధి కల్పన ముందు చేయబడాలి. సరే, రుూపాటికి యిలా కానివ్వండి. మళ్లీ 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చూద్దాం!