Others

వనితా వోటర్లకి ‘టెడ్డీబేర్‌లు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటు అడిగేవాడు వూరికే అడిగితే ఎవడూ చెవిని బెట్టడు. తృణమో, పణమో- క్యాషో, కైండో ఏదో ఒకటి వుండాలి. మోదీ మహాశయుడు ‘క్యాష్’ తోక కోసేశాడు కనుక వోటర్‌లకి మరేవో, మరేవో ముట్టజెప్పి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు తంటాలు పడుతున్నారు. ఐనా, మొన్న పోలింగ్ ముగిసిన గోవా పోలింగ్‌లో రికార్డు స్థాయి సుమారు 86 శాతం దాకా ఆడా, మగా ఓటర్లు పాల్గొన్నారు.
ఐతే, ఎన్నికల సంఘం కూడా గోవాలో ఓటర్లను ప్రలోభపెట్టింది. మరి యిది ‘యాంటీ రూల్స్’ అంటూ అరవకూడదు. ఫలానీ అభ్యర్థికి లేదా ఫలానీ గుర్తుకు మీరు ఓటు ‘నొక్కండి’ అంటే తప్పుగానీ పోలింగ్ కేంద్రాలకి రాండి- ఓటు వేయం డి, మీకు ‘కానుకలు’ ఇస్తాం అంటూ గులాబీ రంగు (పింక్) పోలింగ్ కేంద్రాలు ఏర్పాటుచేయడం గోవా ప్రత్యేకత. ఫిబ్రవరి 4న గోవాలో నలభై ‘పింక్’ (గులాబీ రంగు అలంకరణలుగల) పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడికి, మొట్టమొదటిసారి ఓటు హక్కు సంపాదించుకున్నవాళ్లకి ముందుగా వచ్చి, ఓటు వేసి వ్రేలికి చుక్క పొడిపించుకుంటే- యువతీమణులకి పింక్ టెడ్డీబేర్ బొమ్మలు- అదే యువకులకయితే రాసుకుందికి ఓ ‘కలం’ బహుమతిగా ఇచ్చారు. ఈ గులాబీ పోలింగ్ బూత్‌లలో యాజమాన్యం, సేవలు- అన్నీ మహిళామణులే నిర్వహించారు. పైగా నెం.54 బ్యాంబూరూఫ్ అండ్ బ్యాం బూఫ్లోర్ అన్న బ్యాంబూ హవుస్ ఇంగ్లీషు పాటలోలాగా యిక్కడ పోలింగ్ కేంద్రం యొక్క గోడలు, ద్వారాలు, బల్లలూ అన్నీ, ఉద్యోగులూ- పింకు రంగు ముస్తాబులోనే దర్శనం ఇవ్వగా మామూలు కేంద్రాలలో కన్నా రుూ గులాబీ బూత్‌లలో రెండు శాతం ఎక్కువగా పోలింగ్ జరిగిందట! మొత్తం లక్షా ఆరు వందల నలభై రెండు కేంద్రాలలో- 40 పింక్‌వి అయితే ఏమూలకి? అనకండి. సదా ఆంక్షలు పెట్టే ‘ఇ.సి’- కనుకలు ఇవ్వడమే ‘మజా’!