Others

అనాసతో అజీర్తి దూరం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాసలో కెలోరీలు చాలా తక్కువ. వంద గ్రాముల ముక్కల్లో యాభై కెలోరీలు ఉంటాయి. దీనిలో హాని చేసే కొవ్వులూ, కొలెస్ట్రాల్ ఉండవు. పెక్టిన్ అనే కరిగిపోయే పీచు అనాసలో వుంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అజీర్తి సమస్య తలెత్తకుండా చూస్తుం ది. అనాసలో యాంటీ క్యాన్సర్ గుణాలు అధికం. దెబ్బ తగిలినప్పుడు రక్త ఎక్కువ సమయం కారకుండా త్వరగా గడ్డ కట్టడానికి అనాసలోని పోషకాలు ఉపయోగపడతాయి. ఈ పండు ఎక్కువగా తినే వాళ్లు కీళ్ల నొప్పుల బారిన పడకుండా ఉంటారు. అనాసలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రక్తం సరఫరా సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి. శరీర భాగాలకు ప్రాణవాయువుని చక్కగా అందిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలో హాని చేసే ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి. ఈ పండులో విటమిన్ ఎ, బీటా కెరోటిన్ కూడా లభిస్తాయి. ఇవి కళ్ళకు చాలా మంచివి. చర్మ సంబంధిత రుగ్మతలు రాకుండా చేస్తాయి. అనాసలోని ఫ్లవనాయిడ్స్ ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు దరి చేరకుండా కాపాడతాయి. అనాసలోని ఫోలేట్, థయామిన్, రైబోప్లెవిన్, పొటాషియం, కాపర్ గుండె వేగాన్ని క్రమబద్ధీకరిస్తాయి. రక్తపోటు రాకుండా కాపాడుతుంది. కాపర్ ఎర్ర రక్తకణాల వృద్ధికి సాయపడుతుంది. మాంగనీసు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి తోడ్పడుతుంది.

- నీలిమ సబ్బిశెట్టి