Others

ముంచేస్తున్న మంచు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘గ్రీన్‌లాండ్’ ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీపంగా, అతి తక్కువ జనసాంద్రత కలిగిన దేశంగా పేరుపొందింది. ఈ చిన్న దేశం మంచులా కరిగిపోతూ చివరికి మనుగడ కోల్పోయే ప్రమాదం దాపురించింది. ఆర్కిటిక్ సముద్రానికి, ఉత్తర అట్లాంటిక్ సముద్రానికి మధ్య కెనడాకు ఈశాన్యంగా, ఐస్‌లాండ్‌కి వాయువ్యంగా ఉంది గ్రీన్‌లాండ్. 44,087 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగిన గ్రీన్‌లాండ్ చట్టూ నూరు చిన్న చిన్న ద్వీపాలుంటాయి. ఈ దేశం భూభాగంపై అధిక భాగం మంచుతెరలు దుప్పటివలె పరుచుకుని ఉంటాయి. ఎప్పుడూ భూభాగం అన్నది కనబడదు. మంచుతో కప్పబడి ఉండే గ్రీన్‌లాండ్ వివిధ దేశాల పర్యాటకులనీ, సాహసకృత్యాలు చేసేవారినీ విశేషంగా ఆకర్షిస్తోంది.
అందచందాలకు నిలయమైన గ్రీన్‌లాండ్‌కి ఇపుడు పర్యావరణ సమస్య వచ్చిపడింది. గ్రీన్‌లాండ్‌లో 1900-2010 మధ్యకాలంలో 9 వేల గిగా టన్నుల మంచు కరిగిపోయిందని, ఇటీవల మంచు కరిగే వేగం అనూహ్యంగా పెరిగిందని పరిశోధనల్లో తేలింది. గత శతాబ్దంతో పోలిస్తే 2003-2010 మధ్యకాలంలో మూడు రెట్లు ఎక్కువగా మంచు కరిగింది. దీని ప్రభావం సముద్ర మట్టం పెరుగుదలపై స్పష్టంగా కనిపిస్తోంది. 2003 వరకు మంచు కరగడం సగటున ఏటా 75 టన్నులు ఉండేది. ఆ తరువాత ఏడేళ్ళలో ఇది దాదాపు మూడు రెట్లు పెరిగింది. అంటే ఏడాదికి సగటున అక్కడ 186.4 గిగా టన్నుల మంచు కరుగుతోంది. డెన్మార్క్‌లోని ‘యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హాగన్’కి చెందిన శాస్తవ్రేత్తలు ఏరియల్ ఫొటోగ్రఫీ ద్వారా ఇక్కడి మంచుచరియలను అధ్యయనం చేశారు. 1992 వరకూ గ్రీన్‌లాండ్‌పై దుప్పటిలా పరచుకుని ఉన్న మంచుపొర మొత్తం అదృశ్యమైంది. మంచు కరడంతో 1900 నుండి ఇప్పటిదాకా గ్రీన్‌లాండ్‌లో సముద్ర మట్టం 25 మిల్లీలీటర్లు పెరిగింది. భూగోళం మొత్తం మీద సముద్ర మట్టం పెరగడంలో 10 నుండి 18 శాతం వరకూ గ్రీన్‌లాండ్‌లో మంచు కరగడమే కారణం.
1980 ప్రాంతంలో శాస్తవ్రేత్తల బృందం ఉపగ్రహం సహాయంతో గ్రీన్‌లాండ్ ఉపరితలానికి తీసిన కొన్ని పొటోలను పరిశీలించగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. సాధారణంగా చలి ప్రాంతాల్లో శీతాకాలంలో మంచు పేరుకుని, పెద్ద కొండలుగా ఏర్పడటం చూస్తాం. వేసవిలో మంచు కరిగి, ఆ కొండ చరియలు విరిగిపడుతున్న సమయంలో అక్కడ ఏర్పడ్డ పల్చటి నీటి చారలను శాస్తజ్ఞ్రులు ఫొటోల్లో గుర్తించారు. ఈ చారలను బట్టి ఏటా ఎంతమేరకు మంచు కరిగి, అక్కడి మంచుకొండలు కనుమరుగైపోయాయో తెలుసుకోవచ్చు. ఏటా ఆ నీటిచారల విస్తీర్ణం పెరగడం నిపుణులు గమనించారు. 19 శతాబ్దం ప్రారంభంలో గ్రీన్‌లాండ్‌లో మంచు చరియలు కనుమరుగైనపుడు ఏర్పడిన నీటి చారల నిడివి చాలా చిన్నది. 1980 దశకం వచ్చేసరికి ఆ నిడివి చాలా ఎక్కువగా పెరిగిపోయింది. అంటే మంచు ప్రాంత పరిమాణం క్రమంగా తరిగిపోతోందన్నమాట. పర్యావరణం ఘోరంగా దెబ్బతింటోందని ఇదో హెచ్చరిక!
జర్మనీలోని ‘ఆల్ఫ్రెడ్ వేగెనెర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్రేమేర్హేవెన్’లో వాతావరణ శాస్తవ్రేత్తగా పనిచేస్తున్న క్లూస్ గ్రాస్ఫిల్డ్ పే ర్కొన్నట్లు- ‘గ్రీన్‌లాండ్ వంటి ప్రాంతాల్లో ఎండాకాలంలోనూ మంచు కురుస్తూంటుంది. ఇది సహజంగా జరిగేదే. కానీ ఇటీవల మంచు కరిగే మోతాదు విపరీతంగా పెరిగిపోతోంది. ఇందుకు కారణం మానవ ప్రమేయమే. మానవులు చేస్తున్న తప్పిదాల వల్ల భారీస్థాయిలో మంచు కరుగుతోంది. వాతావరణ సంతులనం దెబ్బతింటోంది. ఫలితంగా భూగోళంపై అనేక ఉత్పాతాలు సంభవించే అవకాశం ఉంది...’ అని అంటారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ ఛేంజ్’ (ఐపిసిసి) వాతావరణంలో మార్పులు సముద్ర మట్టంపై చూపే ప్రభావం గురించి అధ్యయనం చేస్తుంది. 2013లో ఈ ప్యానల్ సమర్పించిన ఐదవ నివేదికలో పేర్కొన్న విషయాలు పర్యావరణవేత్తలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ధ్రువ ప్రాంతాలలో పెద్ద ఎత్తున మంచు కరుగుతోందంటే దానర్థం- భారీగా జలాలు సముద్రాలలో కలుస్తున్నాయని. గ్రీన్‌లాండ్, అంటార్కిటికాలలో కరుగుతున్న మంచువల్ల సముద్రమట్టం అనూహ్యంగా పెరుగుతోంది. ఇరవయ్యవ శతాబ్దం చివరి దశాబ్దంలో సముద్ర మట్టం పెరుగుదల సగటున ఏడాదికి 0.2 మిల్లీ మీటర్లు ఉండగా, 2010 తరువాత ఇది మూడు రెట్లు పెరిగింది. సముద్ర మట్టం సగటున ఏడాదికి 0.6 మిల్లీమీటర్లు పెరుగుతోంది. భూ ఉపరితల ఉష్ణోగ్రతలో పెరుగుదల ప్రభావమే ఇదంతా అని చెప్పకతప్పదు.
అమెరికాకు తూర్పుగా, ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రానికి పశ్చిమం వైపుగా ఉన్న వేడి నీటి ప్రవాహాన్ని ‘గల్ఫ్‌స్ట్రీమ్’గా వ్యవహరిస్తారు. ఇది సెకనుకు 30 మిలియన్ క్యూబిక్ వేగంతో ప్రవహిస్తుంది. దీనికి ఉత్తరాన గ్రీన్‌లాండ్ ఉంది. 2010-13 మధ్యకాలంలో గ్రీన్‌లాండ్‌లో భారీగా మంచుకొండలు విరిగిపడి సముద్రంలో చేరాక, గల్ఫ్‌స్ట్రీమ్‌లో కలుస్తాయని ఐపిసిసి నివేదిక పేర్కొంది. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలోని ‘నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్’ ఇటీవల వెలువరించిన నివేదికలో పలు అంశాలు పేర్కొన్నారు. గత 37 ఏళ్లుగా ఉపగ్రహాల సహాయంతో సేకరించిన సమాచారాన్ని బట్టి అత్యధికంగా మంచు కరుగుతున్న ప్రదేశాలలో గ్రీన్‌లాండ్ 11వ స్థానంలో వుంది. ఇలా పెద్ద మొత్తంలో మంచు కరగడంతో ఒక్క గ్రీన్‌లాండ్ మాత్రమే ప్రభావితం కావడం లేదని అమెరికాలోని ‘నేషనల్ ఓషనిక్ అండ్ ఎట్మోస్పియర్ అడ్మినిస్ట్రేషన్’ (ఎన్‌ఒఎఎ) అధ్యయనం చెబుతోంది. ఆర్కిటిక్ ప్రాంతం కూడా వేడెక్కుతోందని ఈ సంస్థ కనుగొంది. ఆర్కిటిక్ ప్రాంతంలో గత 115 ఏళ్ల ఉష్ణోగ్రతల వివరాలను విశే్లషించగా, 20వ శతాబ్దం ప్రారంభంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉందనీ, ఇది చాలా ఎక్కువ అని నిపుణులు తేల్చారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ ఆ మధ్య నిర్వహించిన సదస్సులో రిక్‌స్పిన్రాడ్ అనే శాస్తవ్రేత్త మాట్లాడుతూ, ‘్భగోళంలోని ఇతర ప్రదేశాలకంటే రెండు రెట్లు ఎక్కువ వేగాన్ని మించి ఆర్కిటిక్ వద్ద ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఆర్కిటిక్‌లో సంభవిస్తున్న ఈ మార్పులు ఈ ఒక్క ప్రాంతానికే పరిమితమైపోవు’ అని ఆందోళన చెందారు. పర్యావరణానికి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం కోసం ఏప్రిల్ 2016లో వివిధ దేశాల నాయకులు పారిస్‌లో సమావేశమయ్యారు. భూ వాతావరణం వేడెక్కడంతో భవిష్యత్తులో ప్రపంచానికి సంభవించబోయే జలప్రళయాన్ని నివారించేందుకు తగు చర్యలు తీసుకోవాలని వీరంతా పలు నిర్ణయాలు తీసుకున్నారు.

-దుగ్గిరాల రాజకిశోర్ సెల్: 80082 64690