AADIVAVRAM - Others

మీరే డిటెక్టివ్ 22 రామాయణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీకో ప్రశ్న

ఈ ఐదుగురు భక్తుల్లో ఎవరు
రాముడి దాసులో చెప్పగలరా?
1. రామదాసు, 2. కబీర్‌దాసు, 3. తులసీదాసు,
4. సూరదాసు, 5. పురందర దాసు

నువ్వు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి కామాన్ని రెచ్చగొట్టి, ఆయన తపస్సుని భగ్నం చేయి’
‘కోపంతో విశ్వామిత్రుడు నన్ను శపించవచ్చని భయంగా ఉంది’ రంభ చెప్పింది.
‘రంభా! భయపడకు. నేను చెప్పినట్లు చేయి. వసంత ఋతువులో నీ అందంతో అతని తపస్సుకి భంగం కలిగించు’
కోకిల పాటలు విన్న విశ్వామిత్రుడు అందమైన రంభని చూడగానే అది ఇంద్రుడి పథకంగా గ్రహించాడు.
‘కామక్రోధాలని జయించాలి అనుకునే నన్ను వ్యామోహంలోకి లాగాలని అనుకున్న నువ్వు వేయి సంవత్సరాలు బండ రాయిగా పడి ఉండు. తపోబలం గల ఓ బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు’
రంభ తక్షణం రాయిగా మారిపోయింది. అది చూసి మన్మథుడు, ఇంద్రుడు పారిపోయారు. విశ్వామిత్రుడికి తను ఇచ్చిన శాపానికి పశ్చాత్తాపం కలిగింది. తనకి ఇంద్రియాల మీద ఇంకా ఆధిక్యత రాలేదని తెలుసుకుని మనశ్శాంతి పోయింది. తను ఇక వౌనంగా ఉండి వందల ఏళ్లు శరీరాన్ని శుష్కింపజేసి ఇంద్రియాలని జయించాలని, తపస్సుతో తనకి బ్రాహ్మణత్వం లభించే దాకా ఆహారాన్ని వదిలేసి, ఊపిరిని బిగించి వేయి సంవత్సరాలు తపస్సు చేయాలని నిశ్చయించుకున్నాడు.
‘రామా! ఆ తర్వాత విశ్వామిత్రుడు పశ్చిమం నించి తూర్పుకి వెళ్లి వౌనంగా, ఎన్ని విఘ్నాలు కలిగినా, కోపం తెచ్చుకోకుండా అతి తీవ్రమైన తపస్సుని ఆరంభించాడు. అలా వెయ్యి సంవత్సరాలు గడిచాక విశ్వామిత్రుడు భోజనానికి కూర్చుంటే, ఓ బ్రాహ్మణుడు భోజనం పెట్టమని కోరాడు. ఆయన తన భోజనాన్ని వౌనంగా ఆయనకి ఇచ్చేసి మరో వెయ్యి సంవత్సరాలు ఊపిరి బిగబట్టి తపస్సు చేయసాగాడు.
మళ్లీ అతని తపోభంగానికి ఇంద్రుడు తిలోత్తమని పంపినా అతని పాచిక పారలేదు. అతని తల నించి మూడు లోకాలు తగలబడుతున్నాయా అనేంత పొగ రాసాగింది. విశ్వామిత్రుడి తేజస్సు దేవ, గాంధర్వ, పన్నగ, అసుర, రాక్షసులని పీడించసాగింది. వారు శాంతిని కోల్పోయి బ్రహ్మ దగ్గరికి వెళ్లి మొర పెట్టుకున్నారు.
‘విశ్వామిత్రుడు ఎలాంటి వ్యామోహాలకి లొంగక తపస్సుతో వృద్ధి చెందుతున్నాడు. కొద్దిగా కూడా పాపం మిగలని ఆయన కోరిన వరాన్ని నువ్వు ఇవ్వకపోతే పర్వతాలు పగిలి, సముద్రాలు క్షోభిస్తున్నాయి. దేనికీ ప్రకాశం అనేదే లేదు. భూమి కంపిస్తోంది. గాలి బలహీనమైంది. ప్రజలు నాస్తికులు అవుతున్నారు. మహర్షి తేజస్సు ముందు సూర్యుడి కాంతి వెలవెల బోతోంది. అతని తేజస్సు వల్ల మూడు లోకాలు నాశనం కాకముందే త్వరపడు. పూర్వం ప్రళయాగ్నితో మూడు లోకాలు కాలిపోయినట్లు కాలుతున్నాయి. ఇతను దేవ లోకానికి రాజు అవాలని కోరుకుంటే ఆ వరం ఇవ్వు’
వారి వెంట వచ్చిన బ్రహ్మ విశ్వామిత్రుడితో చెప్పాడు.
‘నీ ఉగ్ర తపస్సుకి సంతోషించాను. నువ్వు బ్రాహ్మణత్వం పొందావు. నీకు దీర్ఘాయువుని కూడా ఇస్తున్నాను’
దానికి సంతోషించిన విశ్వామిత్రుడు ఇలా కోరాడు.
‘ఐతే వేదాలు, ఓంకార వషట్కారాలు (దేవతలకి హవిస్సులని సమర్పించే అర్హత) నన్ను వరించి, వేదాలని ఇతరులకి బోధించే, యజ్ఞ యాగాదులని చేయించే అర్హత కావాలి. ఇదంతా జరిగితే మీరు వెళ్లచ్చు’
దేవతలు బతిమాలితే వశిష్ఠుడు వచ్చి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడని అంగీకరించాడు. దేవతలు వెళ్లిపోయారు.
బ్రహ్మర్షి విశ్వామిత్రుడు వశిష్ఠుడ్ని పూజించాడు. ‘రామా! విశ్వామిత్రుడు మునుల్లో శ్రేష్ఠుడు’
ఆ తర్వాత విశ్వామిత్రుడు అయోధ్యకి బయలుదేరాడు. (బాలకాండ సర్గ 63,64,65లోని 26వ శ్లోకం దాకా)
అశే్లష హరికథ విన్నాక బస్‌స్టాప్‌కి వెళ్లాడు. అక్కడ ఉన్న సాధువు నవ్వి అడిగాడు.
‘గతంలో హరిదాసు చెప్పిన సర్గ 23, 24 కథ చెప్పావు. ఇవాళ ఏ సర్గలు చెప్పారు?
అశే్లష చెప్పిన కథ విన్నాక ఆయన ‘నువ్వు చెప్పిన కథలో ఏడు తప్పులు ఉన్నాయి. అవేమిటో చెప్తా విను’ అని వాటిని చెప్పాడు. వాటిని కనుక్కోగలరా?

గత వారం ‘మీకో ప్రశ్న’కి జవాబు

బాలకాండలో 63 సర్గలోని 3వ శ్లోకం రెండో పాదం మొదట్లో వచ్చే అది ‘విశ్వామిత్రః’లోని ‘వి’ అక్షరం.

కిందటి వారం రామాయణ కథలో తప్పులు

1.శునశే్శషుడి మేనమామే విశ్వామిత్రుడు. ఇది హరిదాసు చెప్పలేదు.
2.విశ్వామిత్రుడు కొడుకు మధుష్యందుడు మొదలైన వారు పరిహాసంగా చెప్పారు. కాని హరిదాసు మధుష్యందుడి పేరు చెప్పలేదు.
3.పదేళ్లు కాదు. ‘వెయ్యేళ్లు భూమి మీద జీవించండి’ అని విశ్వామిత్రుడు కొడుకులని శపించాడు.
4.మొదటిసారి బ్రహ్మ వచ్చినప్పుడు ‘నీ పుణ్యం చేత నువ్వు ఋషివి అయ్యావు’ అన్నాడే తప్ప మహర్షి అయ్యావు అని చెప్పలేదు.
5.ఇంద్రుడు పంపింది ఊర్వశిని కాదు. మేనకని.
6.కౌశికీ నదీ తీరంలో విశ్వామిత్రుడు తపస్సు చేసింది ఐదు వందల సంవత్సరాలు కాదు. వెయ్యి సంవత్సరాలు.
7.రెండోసారి ఇంద్రుడు అప్సరసైన మేనకని కాదు. రంభని పిలిచాడు.

మల్లాది వెంకట కృష్ణమూర్తి