Others

నాకు నచ్చిన చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్, మమ్ముట్టి, అరవింద్‌స్వామి ప్రధాన తారాగణంగా రూపొందించిన ‘దళపతి’ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఆయన తీసిన సినిమాలన్నీ క్లాస్ అయితే చాలా కొద్దిమాత్రమే మాస్ సినిమాలు. అందులో దళపతికి అగ్రతాంబూలం ఇవ్వచ్చు. రజనీ రఫ్ లుక్‌తో అపర కర్ణునిగా కనిపిస్తాడు. మమ్ముట్టి లాంటి మలయాళ తారతో ఈ చిత్రం సుయోధన పాత్ర గుర్తుకు వస్తుంది. మహాభారతాన్ని సాంఘిక కథనంగా చేసి మణిరత్నం ఓ అద్భుతాన్ని సృష్టించాడు. శ్రీవిద్య కుంతిగా, అరవింద్‌స్వామి అర్జునుడిగా, అమ్రిష్‌పురి శకునిగా, రాధగా భానుప్రియ, భానుమతిగా గీత నటించడం విశేషం. ఆడజన్మకు, సింగారాల పైరుల్లోన, చిలకమ్మా చిటికేయంగా మొదలైన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే వుంటాయి. రజనీ వేసిన స్టైలిష్ స్టెప్స్ నిర్మలమ్మతో కలిసి చేసిన డాన్సు మర్చిపోలేం. దేవా దేవా అంటూ పలికిన డైలాగు కూడా వెంటాడుతుంది. ఇళయరాజా గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్రిష్‌పురి ఆహార్యం, సంభాషణలు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. అరవింద్‌స్వామిని చూసి ఎవరీ ఆరడుగుల అందగాడని అందరూ ఆశ్చర్యపోయారు. మమ్ముట్టి కూడా హుందాగా వుంటూనే, పంచ పైకి కట్టి ఫైట్స్ చేసే దృశ్యాల్లో మాస్‌ను ఆకర్షిస్తాడు. శోభన తన పాత్రను కళ్లతోనే నటించింది. మల్టీస్టారర్ సనిమా అంటే ఇది అన్నట్లుగా తీశాడు మణి. దళపతి నేను ఇష్టపడి చేసింది కాదని, మాస్‌కోసం చేశానని మణిరత్నం అప్పట్లో చెప్పాడు. ఇప్పటికీ మణిరత్నం కాస్త వెనక్కి తగ్గినా దళపతి-2 వస్తే ఎంత బాగుండు అనిపిస్తుంది.

-కాళిదాసు విజయచంద్ర, కావలి