Others

అదృష్ట రేఖ .. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా వెండితెరపై అవకాశం లభించాలంటే తారలు కావాలనుకున్న వారు తమ ఛాయా చిత్రాలను నిర్మాతలు, దర్శకులకు పంపి అదృష్టం పరీక్షించుకోవటం పరిపాటి. అంటే -్ఫటో షూట్‌లు ఇప్పుడే కాదు అప్పుడే ఉన్నాయన్న మాట. సినిమావారి అభిరుచికి తగ్గట్టుగా ఛాయాచిత్రాలు తీయటం అందరికీ సాధ్యంకాదు. ఈ విషయంలో స్టిల్ ఫొటోగ్రాఫర్ భూషణ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఆయన ప్రావీణ్యత తెలిసినవారు అపర సినీబ్రహ్మగా కీర్తించేవారు. ఆయన ఛాయాచిత్రం తీయటానికి అంగీకరిస్తే -ఇక ఆ నటుడు/ నటి అరచేతిలో అదృష్ట రేఖ పుట్టుకొచ్చినట్టే. అలాగని ఎవరికిపడితే వారికి ఫొటో తీయటానికి ఆయన అంగీకరించేవాడు కాదు. నటుడు/ నటి ముఖారవిందం కెమెరా 24 ఫ్రేములకు సరిపడుతుందా? లేదా? అని నిర్ణయించే ప్రావీణ్యత భూషణ్‌కు మెండుగా ఉందన్న నమ్మకం సినిమా పరిశ్రమలో ఉండేది.
నటి హేమామాలినికి భూషణ్ తీసిన మొట్టమొదటి ఛాయాచిత్రం వల్లే ‘శ్రీకృష్ణ విజయం’ (1971) చిత్రంలో నృత్య కళాకారిణిగా అవకాశం లభించింది. మహానటుడు, దర్శకుడు రాజ్‌కపూర్ ఆ ఛాయాచిత్రం చూసి తన సరసన నటించే అవకాశం ‘సప్నోంకా సౌదాగర్’ చిత్రం ద్వారా కల్పించారు. ఆ చిత్రం తర్వాతే హేమామాలిని జాతీయతారగా మారింది. నెల్లూరుకు చెందిన రత్నకుమారి ప్రారంభదశలో రాజనాల, నాగభూషణం పనిచేసిన నాటక సమాజాల్లో నటిగా పరిచయమై, తర్వాతి కాలంలో చిన్నపాత్రల ద్వారా పరిశ్రమలో కాలుమోపి వాణిశ్రీగా పేరు మార్చుకొని అగ్రనటిగా పేరు తెచ్చుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి రామానాయుడు నిర్మించిన ‘శ్రీకృష్ణతులాభారం’ చిత్రంలో చెలికత్తె పాత్రలో నటించి, తర్వాత కాలంలో అదే బ్యానర్‌లో నిర్మించిన ‘జీవనతరంగాలు’, ‘సెక్రటరీ’ (అన్నపూర్ణా స్టూడియోలో నిర్మించిన మొదటి తెలుగు చిత్రం), ప్రేమనగర్ (తెలుగు, తమిళం) చిత్రాల్లో నాయికగా నటించి ఆ సంస్థకు కనకవర్షం కురిపించింది. ఇలా ఎన్టీఆర్, అక్కినేనిలాంటి అగ్ర నటుల సరసనే కాకుండా, తర్వాతితరం హీరోలు కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజుల సరసనా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. అలాగే జగపతి సంస్థ నిర్మించిన ‘ఆస్తిపరులు’ చిత్రంలో కేవలం ‘సోగ్గాడే చిన్నినాయనా’ అనే పాటలో నృత్యతారగా నటించి అదే సంస్థ నిర్మించిన ‘దసరాబుల్లోడు’ చిత్రానికి నాయికస్థాయికి ఎదగింది. ఆ చిత్రం హైదరాబాద్‌లో ఏడాది ప్రదర్శించబడి అఖండ విజయం సాధించింది. పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన వాణిశ్రీ, వివాహం చేసుకొని అభినయ, వెంకట్ కార్తిక్ అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చి గృహిణిగా స్థిరపడింది. దాదాపు పనె్నండేళ్ల తర్వాత హీరో కాంతారావు నిర్మాతగా నష్టపోయి ఆర్థిక ఇబ్బందులతో సతమతవౌతున్న సమయంలో ఆయనకి ధైర్యం చెపుతూ మళ్ళీ చిత్ర నిర్మాణం చేసేలా సహకరిస్తూ ‘స్వాతి చినుకులు’ చిత్రం ద్వారా సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విజయవంతమైన చిత్రాల్లోనూ నటించింది. ఆ చిత్రానికి నంది అవార్డు లభించటం గమనార్హం.
ఇక్కడ కనిపిస్తున్న చిత్రం -వాణిశ్రీకి భూషణ్ తీసిన మొదటి ఛాయా చిత్రం. వాణిశ్రీలోని అందాన్ని, నటనా సామర్థ్యాన్ని భూషణ్ తన కెమెరా నేత్రంలో ముందే చూశారని చెప్పడానికి ఈ ఒక్క ఛాయాచిత్రం చాలు.
*

-పర్చా శరత్‌కుమార్ 9849601717