Others

ప్రీతి రీఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-ఎవరి వీలును బట్టి వాళ్లు సిల్వర్ స్క్రీన్‌కు రీ ఎంట్రీ ఇవ్వడం సీనియర్ హీరోయిన్లకు కొత్తేం కాదు. వయసు మళ్లిన తరువాత అందమైన అక్క, గ్లామర్ అత్త పాత్రల్లో నటించేందుకు ఆసక్తి చూపించటం ఇటీవలి కాలంలో కాస్త ఎక్కువైంది. 90వ దశకంలో హీరోయిన్‌గా తనదైన గ్లామర్‌తో ఆకట్టుకున్న భామలు చాలామంది ఇప్పటికే రీ ఎంట్రీలతో కెరీర్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో రీ ఎంట్రీకి రెడీ అంటోంది సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా. మహేష్‌బాబుతో ‘రాకుమారుడు’లో గ్లామర్‌గా కనిపించి, వెంకటేష్ హీరోగా వచ్చిన ప్రేమంటే ఇదేరా సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న ప్రీతిజింటా -షారూఖ్‌తో ‘దిల్‌సే’ చేసిన తరువాత వెనక్కి తిరిగి చూడలేదు. సాగినంతకాలం బాలీవుడ్‌లో కెరీర్ సాగించి, గత ఏడాది పెళ్లి చేసుకున్న ప్రీతి, ఐపీఎల్ క్రికెట్ ప్రాంచైజ్ తీసుకుని వ్యాపారాన్నీ చక్కబెట్టింది. తాజాగా ‘్భయ్యాజీ’ సూపర్ హిట్ సినిమాతో రీ ఎంట్రీకి
ప్రతి ట్రై చేస్తోందని అంటున్నారు. గ్యాంగ్ స్టోరీ నేపథ్యంలో రూపొందే . సినిమా తనకు మంచి పేరు తెస్తుందన్న ఆశాభావంతో కనిపిస్తోంది. తెలుగు స్క్రీన్‌పైనా మళ్లీ ప్రీతి మెరుస్తుందేమో చూడాలి.