Others

రహస్య వివాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్ల చాటుమాటు ప్రేమాయణాలు ఈరోజుల్లో సాధారణ వ్యవహరమే. అడపాదడపా రహస్యంగా పెళ్లిళ్లు చేసుకున్న సందర్భాలూ మామూలే. తాజాగా ఈ కోవలో మరో హీరోయిన్ రహస్య వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? మనీషా యాదవ్. తమిళంలో పలు చిత్రాలతో హీరోయిన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకున్న మనీషా ‘ఒళక్కు యెన్ 18/9’ అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. తరువాత పలు చిత్రాల్లో నటించి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అదలాల్ కాదల్ చేయి వీర్, జనలు ఒరమ్, త్రిషా ఇల్లద నయనతార వంటి చిత్రాల్లో నటించింది. తరువాత ఐటెమ్ సాంగ్స్‌లోనూ నర్తించిన ఈ భామ, బెంగుళూరుకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వార్నిడ్‌తో రహస్య ప్రేమాయణం సాగిస్తుందంటూ పలుమార్లు వార్తలొచ్చాయి. తాజాగా రెండు రోజుల క్రితం అతన్ని రహస్యంగా వివాహం చేసుకుందట. ప్రస్తుతం ఈ పెళ్లి కోలీవుడ్‌లో సంచలనం రేపుతోంది.