Others

తెలుగు శిశువు స్వగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుగడ్డపై పుట్టిన ప్రతిబిడ్డకీ తెలుగు నేర్చే హక్కుంది.. ఆ హక్కును కాలరాసి మన పాలకులే మమ్ము పరాయి భాషకు బానిసలు చేస్తున్నారు. మా హక్కును గుర్తించి అమలుపరచండి. నేను తెలుగుగడ్డన పుట్టిన తెలుగుబిడ్డను..
తెలుగుతల్లి మనతల్లి.. ననుగన్న మాయమ్మ తెలుగమ్మే, నాన్న కూడ తెలుగునానే్న. కాని దురదృష్టం- పసిగుడ్డుగానున్నప్పటి నుంచీ వారు నన్ను ఆంగ్లభాష నేర్పే నర్సరీలో పడేస్తున్నారు. అక్కడ- ‘గుడ్ మార్నింగ్’, ‘ట్వింక్‌ల్ ట్వింకిల్ లిటిల్ స్టార్’ నేర్పిస్తారు. వాటిని అమ్మానాన్నలకు అప్పజెప్తే- ‘వెరీగుడ్.. కీప్ ఇట్ అప్’ అని ముద్దిస్తారు. వారు ‘మమీడాడీ’ అయిపోతారు.
‘చందమామ రావె.. జాబిల్లి రావె’ పాటలు మాకెలా వస్తాయి..? ఏ కోశాననో ‘మమీడాడీ’లకు తెలుగు భాషాభిమానం గుర్తుకువచ్చి పుట్టుకొస్తే- తెలుగు నేర్పే బడిలో చేర్చదలచినా- అక్కడ ‘మన తెలంగాణ’ అని చెప్పుకునే కెసిఆర్ గాని, ఇక్కడ ‘తెలుగుదేశమ’ని గద్దెనెక్కిన చంద్రబాబు గాని- తెలుగు వాసన సోకకుండా మాకు అక్షరాభ్యాసమయిన పసితనంలోనే ‘ఎబిసిడి’ (ఆంగ్ల అక్షరమాల) అభ్యాసకూపం చూపి జాగ్రత్తపడుతున్నారు.
ఇరవై ఒకటవ శతాబ్దం వచ్చేసి పదహారేళ్లు గడిచాయి.. అన్నివర్గాల ప్రజలూ వారి వారి హక్కుల కోసం పోరాడుతూంటే- మరోవైపు... పిల్లలమైన మేము కూడా మా హక్కులను కాపాడాలనే ప్రయత్నాల్లో ఉన్నాం.. ‘తెలుగుబిడ్డకు తెలుగు నేర్చుకునే హక్కు లేదా?’ అని అలమటిస్తున్నాం, ‘మార్గం చూపు తెలుగుతల్లీ’ అని వేడుకుంటున్నాం.
‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ.. మా కన్నతల్లికి మంగళారతులు’ అని పాడుతూ గద్దెలనెక్కిన వారు ధూర్తులు, స్వార్థపరులు.. తల్లిపాలు తాగి తల్లిరొమ్మునే గ్రుద్దే ద్రోహులు.. పరాయి భాషను నెత్తికెత్తుకునే బానిసలు వీరు. తెలుగు నాశనానికి విత్తనాలు నాటే పయోముఖ విషకుంభాలు వీరు.. మమ్ము నీకు దూరం చేస్తున్నారు.
‘నీ దరికి చేర్చే నాథుడెవడున్నాడా?’ అని అలమటిస్తున్న మాకు- పదహారణాల ఆంధ్రుణ్ణి, నూటికి నూరు పైసల తెలుగుబిడ్డను మాకయి కని పంపించుతల్లీ...
తెలుగుబిడ్డగా గర్వంగా ఎదిగే మా హక్కును కాపాడవమ్మా! మేము నీకెల్లప్పుడూ రుణపడి ఉంటాము.. ఎందరో మహనీయులు పెంచి పోషించిన భాషా సంపదను మరింత వికసింప జేసి భావితరాలకు అందించి- నీ రుణం తీర్చుకుంటాము.. ఇంతకీ- ఇదంతా ‘మా తెలుగు నేర్చుకునే హక్కు’ను మాకు అందించినప్పటి మాటయేకదా..!

- ఆచార్య దుగ్గిరాల విశే్వశ్వరం సెల్: 94401 56018