Others

టిక్కెట్ మెషీన్ పాడైనా ఫైన్ తప్పదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరో నెల గర్భవతి అయిన లారేన్ బోల్ట్- ‘వేల్స్’ రాజధాని అయిన కార్డ్ఫి నగర మెయిన్ స్టేషన్ నుంచి రోజూ తన ఉద్యోగానికి వెళ్లి వస్తూంటుంది. పుట్టబోయే శిశువుకోసం పైసా, పైసా కూడబెడుతూంటుంది. అటువంటిది, ఆ రోజు ప్లాట్‌ఫామ్‌మీదున్న టికెట్ మెషీన్ మొరాయించింది. రైలు కదిలే ముందు యింక గత్యంతరం లేక రైలెక్కేసింది. రెండు పౌండ్ల మూడు సెంట్‌ల టిక్కెట్. రైలెక్కేక కండక్టర్ దగ్గర కొందామనుకుంది. అంతా క్యాష్‌లెస్ బాపతు అక్కడి పద్ధతి. లోపల కంపార్ట్‌మెంట్‌లో క్రుక్కినట్లు క్రిక్కిరిసి ఉన్నారు జనం. రైల్వే టికెట్ కండక్టర్ జాడ లేదు. ముందుకు జనం మధ్యనుంచి రుూదుకుంటూ పోదామంటే- గర్భంలో వున్న బిడ్డకు ఏమి ముప్పు వాటిల్లుతుందోనన్న భయం. ఎలాగో పోయి డ్రయివర్ క్యాబిన్ తలుపు తడితే అతడు పెడచెవిన పెట్టాడు. అంతలో తాను దిగాల్సిన క్వీన్‌స్ట్రీట్ స్టేషన్ రానే వచ్చింది. అవతల రైలు కంపార్ట్‌మెంట్ రెక్కల తలుపులు తెరుచుకుంటున్నాయి. అవి మూసుకునే లోపున, ప్లాట్‌ఫామ్ మీదికి దిగాలి (దూకాలి) వూరుకుంటే, ప్రక్క స్టేషన్‌కి టిక్కెట్ వెల యింకా ఎక్కువ. కాగా - తిరిగి రావడానికి టిక్కెట్, ఆనక ‘లేట్’ అయిపోయిందని ఆఫీస్‌లో ‘మెమో’!
పాపం లారేన్ రైల్లోంచి పొట్టను భద్రంగా పట్టుకుని ఒక్క ఉదుటున ఫ్లాట్‌ఫాంమీదకి దూకేసింది. కానీ ఆమె యిల్లు చేరుకున్న రెండో రోజుకి లీగల్ నోటీసు వచ్చింది. పదో తారీఖులోగా రెండు పౌండ్ల ముప్పయి సెంట్ల టిక్కెట్ కొనలేదని- రకరకాల ఫైన్లు, సర్‌ఛార్జీలు వగైరా గుద్దుతూ తడిసి మోపెడు చేస్తూ మొత్తం 10,694 పౌండ్ల 90 సెంట్లు అయిందనీ, చెల్లించలేకపోతే అరెస్ట్ వారెంట్, జైలుశిక్ష తప్పదనీ నోటీసు సారాంశం!
పాపం! ఆ యువతి (23 సం.లు) లబోదిబోమంటున్నది. కరెంట్, నీళ్లు, లాండ్రీ బిల్స్ యివన్నీ ఏం పెట్టి కట్టను? ఈ ఫైన్ కన్నా, ఆ జైలుశిక్ష నయం. చేతిలో పైకం టిక్కెట్‌కి చాలినంత చిల్లర సహా పట్టుకున్నాను. కార్డు వుందిగానీ కార్డ్ఫి పేస్టేషన్‌లో మిషన్ తలపగలగొట్టుకున్నా ఉలక లేదు, పలకలేదు అంటూ ఆ పడది గోల- డిజిటల్ నాగరికతా! నీకో దండం!