Others

‘బుద్ధుణ్ని’ కొడితే మంచి పంటలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చైనా తూర్పు ప్రాంత రాష్ట్రం ఫ్యుజియన్ రాష్ట్రంలో ‘యూక్సీ’ గ్రామంలో ఒక గొప్ప చిత్రమయిన సాంప్రదాయముంది. ఈ ఫిబ్రవరి 10, 11 తేదీలలో కోలాహలంగా జరిగిన ఒక ఉత్సవంలో బుద్ధ భగవానుణ్ని (విగ్రహం) గ్రామీణులు కసితీరా, కొరడాలతో చితకబాదారు. అలా చేస్తే తప్ప బుద్ధుడు కనికరించడు. వారికి ‘వరదల’నుంచి రక్షణ యిచ్చి, మంచి పంటలు పండే వరం ప్రసాదిస్తాడుట!
ఈ కొరడా దెబ్బల పండగకి నాలుగు రోజులు ముందు నలుగురు పెద్దలు పూర్తిగా శాకాహారం మాత్రం తిని రుూ వ్రతం నిభాయిస్తారు. అతి ప్రాచీనమయిన బుద్ధుడి రాతి విగ్రహాన్ని ఎర్రని వస్త్రంతో చుట్టి, స్నానం చేయించి, జలాభిషేకం చేసి, పెద్ద పల్లకీలోకి ఎక్కిస్తారు. కానీ రుూ పల్లకీ యాత్రను మరో పనె్నండు మంది బృందం ఎదురొచ్చి అడ్డుకుంటారు. పెద్ద పోట్లాట జరుగుతుంది. ఇరు బృందాల బాహాబాహీ అయినాకా పల్లకీ ఉత్సవ స్థలానికి చేరుతుంది. బుద్ధదేవుడి విగ్రహాన్ని కొరడాలు తెచ్చి గట్టి గట్టి దెబ్బలు కొడతారు- లేకపోతే పారిపోతాడుట!
ఈ పల్లకీ యాత్ర కోసం దూర దూరాల నుంచి భక్తులు వస్తారు. అసలు కథ ఏమిటీ అంటే- కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రాంతానికి వరదలొచ్చాయి. అప్పుడో రైతుకి కలలో దేవుడు కనబడి పొలాల్లో వెతికి తన బొమ్మని తీసి తనకి గుడి కట్టించమని చెబుతాడు. కానీ వాళ్లకి త్రవ్వగా త్రవ్వగా బుద్ధ విగ్రహం ఒకటి బయటపడుతుంది. కానీ ఆ విగ్రహం గుడి కట్టించుకోకుండా ప్రయత్నించినపుడల్లా పారిపోడం మొదలెడుతుంది. దాన్ని కొరడాలతో చితకబాది పారిపోకుండా నిలదీసి గుడి కడతారు. తరువాత ఆ ప్రాంతంలో వరదలు ఆగాయి. పంటలు పండాయి. నాటినుంచీ ఫిబ్రవరి పది, పదకొండు కొరడాల పండుగ అయింది. రైతుల సంబరం అయింది.