Others

అందమైన అమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనెక్కడ లావెక్కాను అని అంటుంది తల్లయిన కరీనాకపూర్. కొంతమంది నేను లావెక్కాను అని ఎందుకు అంటున్నారు అని ఈ అందమైన అమ్మ ప్రశ్నిస్తుంది. డిసెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చిన కరీనా ప్రముఖ డైటీషియన్ రుజుత దివేకర్ సలహాలతో స్లిమ్‌గా తయారయ్యాయని చెబుతుంది. నా కొడుకు ఏడిస్తే చాలు చేతుల్లో ఎత్తుకుని ఇల్లంతా తిరుగుతాను. అలా తిప్పితేనే ఏడుపు ఆపి ఊరుకుంటాడట. భవిష్యత్తు ప్లాన్‌కు నా బిడ్డే నన్ను అలా చేస్తున్నాడేమో అని మురిసిపోతుంది. నిజమే మరి మాతృత్వపు మమకారం అలాంటిది మరి. తల్లయినప్పటికీ గతంలో వలే ఎనర్జిటిక్‌గా ఉన్నానని అంటున్నారు. తొమ్మిది నెలల్లో శారీరకంగా నాలో చాలా మార్పులు సంభవించాయని, మళ్లీ రెండు నెలల్లోనే యథాస్థితికి వచ్చేశానని చెబుతూ తన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్‌చేసింది ఈ 36 ఏళ్ల కరీనా కపూర్. ఇపుడు నన్ను అభిమానులు ఇష్టపడతారనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ప్రతిరోజూ గ్లాసు పాలు, పెరుగు తీసుకుంటున్నాను. వెన్నతో చేసిన రోటీలు, బెల్లం, రైస్ లేదా కిచిడి రోజుకు రెండుసార్లు తింటున్నాను. చక్కగా అవసరమైన మేరకు వ్యాయామం చేస్తున్నాను. నా కొడుకు తైమూర్‌ను ఎత్తుకుని ఇల్లంతా తిరగటమే నాకు మంచి వ్యాయామం అని చెప్పకనే చెబుతుంది కరీనాకపూర్

-జి.కృష్ణమూర్తి