Others

నాకు నచ్చిన చిత్రం--లేత మనసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవిఎమ్ సంస్థ నిర్మించే చిత్రాలు సకుటుంబంగా చూడదగిన సినిమాలుగా ఐఎస్‌ఐ ముద్రవేసుకున్నాయి. 1966లో విడుదలైన ‘లేత మనసులు’ సినిమా 50 ఏళ్లు దాటినా పిల్లలను, పెద్దలను అలరించిన, అలరిస్తున్న సినిమా. ప్రేమించి పెళ్లిచేసుకున్నా పెద్దవారి ఆస్తులు, అంతస్తుల తేడాలు, పంతాలు పట్టింపులతో ఆలుమగలు విడిపోతారు. విడిపోయి తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు అనుకోని రీతిలో కలుసుకుని, కవలలు కావడంతో తమ స్థానాలు మార్చుకుని తాత సాయంతో తల్లిదండ్రులను కలిపిన పిల్లల కథే ‘లేతమనసులు’. ఇందులో లల్లీ-పప్పీగా నటించిన బేబి పద్మిని నటనకు పెద్ద తారలు, ప్రేక్షకులు కూడా ముక్కున వేలేసుకున్నారు. అందువల్లే ఈ సినిమా థియేటర్లలో కనకవర్షం కురిపించింది. లల్లీ హెయిర్ స్టయిల్ చాలాకాలం కొనసాగగా, పప్పి తండ్రిని అనుకరిస్తూ ముక్కును ఎగపీల్చే మేనరిజం ఆకట్టుకుంది. ద్విపాత్రాభినయంతో రెండు విభిన్నమైన పాత్రలను పరిణితితో నటించి చిత్ర విజయంలో ప్రముఖ పాత్ర పోషించింది. తల్లిదండ్రులుగా హరనాథ్, జమున హిట్ పెయిర్‌గా నిలిచి ప్రేమికులుగా హుషారైన నటన, పిల్లలను దూరం చేసుకున్న తల్లిదండ్రులుగా విషాద సన్నివేశాల్లో జీవించారు. కఠిన హృదయురాలైన తల్లిగా జి వరలక్ష్మి, అసహాయ భర్తగా రేలంగి, స్నేహితునిగా పద్మనాభం తమ పాత్రలలో ఒదిగిపోయారు. ఎమ్‌ఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో ‘అందాల ఓ చిలుకా’ (పిబిఎస్, సుశీల), ‘హలో మేడమ్ సత్యభామ’ (పిబిఎస్, పిఠాపురం), ‘పిల్లలు దేముడు చల్లనివారె’ మరియు ‘కోడి ఒక కోనలో’ (సుశీల) గీతాలు నేటికీ అలరిస్తున్నాయి.

-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం