Others

కుర్ర హీరోలైతే.. ఓకే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరవైయేళ్లొచ్చినా హీరోగా చెలామణి కావచ్చేమోగానీ, మూడు పదులు దాటితే హీరోయిన్ కెరీర్ పూరె్తైపోయినట్టే. ఇదీ లేటెస్ట్ ట్రెండ్. అందుకే -పదహారేళ్లు దాటకుండానే స్క్రీన్‌మీదకు రావడానికి ఉబలాటపడుతూ -పరిశ్రమకొచ్చిన రెండు మూడేళ్లలోనే టాప్ రేంజ్‌కు చేరిపోవాలన్న ఆసక్తిని కనబరుస్తున్నారు ఇప్పటి హీరోయిన్లు. గ్లామరస్ హీరోయిన్‌గా ఇమేజ్ తెచ్చుకుంటే -ఐదారేళ్ల కెరీర్‌కు ఢోకా ఉండదు. అందంతోపాటు పెర్ఫార్మెన్స్ కూడా చూపించగలిగితే -పదేళ్ల కెరీర్ మాత్రం సాధ్యం. తరువాత ఆమెకు సినిమాల తగ్గుతాయి. ఆ స్థానంలోకి మరో కొత్త హీరోయిన్ వచ్చి చేరుతుంది. క్రమంగా పాత హీరోయిన్ కనుమరుగవుతోంది. కొద్దికాలం తరువాత అక్కగానో, అత్తగానో, అదీకాదంటే అమ్మగానో తెరపైకి రావాల్సిందే.

హాలీవుడ్‌లో అయితే నాలుగు పదులు దాటిన సీరోయిన్లూ పెర్ఫార్మెన్స్‌తో సినిమాలు చేస్తూనే ఉంటారు. అది వేరే విషయం. నిజానికి బాలీవుడ్‌లోనైనా ఇదే పరిస్థితి ఉంటుంది. కాకపోతే -అందమైన ముదురు హీరోయిన్లు కొత్త ట్రెండ్‌కు తెరలేపుతున్నారు. కుర్ర హీరోలతో జతకట్టి సినిమాలు చేస్తే -మరికొంత కాలం కెరీర్‌ను సాఫీగా నడిపించొచ్చనే ఆలోచనతో ముందకెళ్తున్నారు. ముదురు హీరోయిన్లు చాలామంది కుర్ర హీరోలతో సినిమాలు చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారట. వాస్తవానికి సీనియర్ హీరోలు తమ పక్కన కుర్ర పిల్లలను పెట్టుకుని కెమిస్ట్రీని పండించినట్టే -సీనియర్ హీరోయిన్లు అదే స్ట్రాటజీని అమలు చేస్తున్నారు. ముదురు హీరోయిన్లతో కుర్ర హీరోలు జతకడుతున్న సినిమాలన్నీ హిట్టు కొడుతుండటం మరో విశేషం. ఆ కోణంలో బాలీవుడ్ చిత్రం ‘ఏ దిల్‌హై ముష్కిల్’ను ప్రస్తావించొచ్చు. ఈ సినిమాలో ఒకప్పటి ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్, యువ హీరో రణబీర్‌కపూర్ అద్భుతమైన కెమిస్ట్రీ పండించింది. ఈ జంట సంచలనం సృష్టించింది కూడా. ఆరాధ్యకు జన్మనిచ్చిన తరువాత కొత్త అందంతో ఐశ్వర్య, రణబీర్‌తో చేసిన రొమాన్స్ ఒకరకం కాదంటూ ఇండస్ట్రీ మొత్తం కోడైకూసింది. తనకంటే చిన్న హీరోతో ఐష్ చేసిన ప్రేమాయణం సంచలనం రేపిందనే చెప్పాలి. ఇక ‘బార్ బార్ దేకో’ సినిమాలో కత్రినాతో హీరో సిద్ధార్థ్ మల్హోత్రా పండించిన కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. కత్రినాకంటే చాలా చిన్నవాడైన సిద్దార్ధ్ -కత్రినాకు పూర్తిగా సహకరించాడన్న కథనాలు వచ్చాయి. ‘పితోడ్’ చిత్రంలో నటించిన కత్రినా కంటే ఆదిత్యరాయ్ చిన్నవాడు. ఈ సినిమాతో వీరిద్దరి వ్యవహారంపై జోరుగా పుకార్లు వినిపించాయి. తెరపై వీరిద్దరి మధ్య రొమాన్స్ అదిరిందనే టాక్ వినిపించింది. ఇక ‘ఏక్ మై ఔర్ ఏక్ తూ’ మూవీలో హీరోయిన్ కరీనాకపూర్‌తో హీరోగా నటించింది ఇమ్రాన్‌ఖాన్. కరీనాకంటే ఇమ్రాన్ ఎంత చిన్నవాడో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అయినా వీరిద్దరిమధ్య కెమిస్ట్రీ చూసినోళ్లు షాక్ తిన్నారు. ‘బద్లాపూర్’ చిత్రంలో హాట్ రొమాన్స్ పండించిన దివ్యదత్తా కంటే హీరో వరుణ్ ధావన్ దాదాపు పదేళ్ల చిన్నోడు. అయినా అతగాడితో ఆమె చేసిన రొమాన్స్ సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేం. లిస్ట్‌లో ఇలాంటివి చాలా సినిమాలే ఉన్నాయి. అందులో ‘కి-కా’ సినిమా పేరు చిత్రంగా ఉన్నట్టే హీరో అర్జున్‌కపూర్ కథానాయిక కరీనాకపూర్ కన్నా చాలా చిన్నోడు. వీరిద్దరి రొమాన్స్‌పై పలు రకాల రూమర్స్ వచ్చాయి. అలాగే ‘గూండే’ కథానాయిక ప్రియాంక చోప్రా.. రణ్‌వీర్ కపూర్, అర్జున్‌కపూర్‌ల కంటే చాలా పెద్దది. అయినా ఇద్దరు కుర్రాళ్లతో మంచి రొమాన్స్ పండించింది. ‘దిల్ బోలే హదిప్పా’ సినిమాలో రాణీముఖర్జీ షాహిద్‌కపూర్‌తో కంటే చాలా పెద్దది. ‘కిస్మత్ కనెక్షన్’ చిత్రంలో కథానాయిక విద్యాబాలన్ కన్నా షాహిద్‌కపూర్ చిన్నోడు. ‘వేకప్ సిద్దూ’ రణ్‌వీర్‌కపూర్ కంటే కొంకణ్ సేన్ నాలుగేళ్లు పెద్దది. ‘బచ్‌నా యే హసీనో’ మూవీలో బిపాసాబసు కంటే దాదాపు అయిదేళ్లు చిన్నోడయిన రణ్‌వీర్‌కపూర్ జోడీకట్టి అదరగొట్టారు.. వీరి రొమాంటిక్ సన్నివేశాలు దుమ్మురేపాయి. ఇక తెలుగులో ఈ తరహా సీనియర్ హీరోయిన్లతో యువ హీరోలు చేసిన సినిమాలు చాలా తక్కువే. అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ, జమున కాంబినేషన్‌లో ఉండమ్మాబొట్టుపెడతా, అమాయకుడు లాంటి సినిమాలు హిట్టయ్యాయి. కృష్ణకంటే జమున ఏడేళ్లు పెద్దది! ఇలాంటివి లెక్కిస్తే చాలానే. మొత్తానికి కుర్ర హీరోలతో రొమాన్స్ చేయడానికి అభ్యంతరాలు లేవంటూ ముదురు హీరోయిన్లు గట్స్ చూపిస్తున్నారు.

-శ్రీనివాస్