Others

తెలుగు చిత్రంలో... ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు (శరత్కాలం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దక్షిణాది చిత్రసీమ నుంచి హిందీ రంగానికి వెళ్ళి జాతీయస్థాయిలో వెలిగిన తారలున్నారు. కాని హిందీ రంగం నుంచి తెలుగు చిత్రాలకు వచ్చి నటించిన వారు ఇద్దరే ఉన్నారు. మొదటి నటుడు అనిల్‌కపూర్ (వంశవృక్షం చిత్రం ద్వారా). రెండో నటుడు జాతీయస్థాయిలో భరత్ అవార్డు పొందిన ఏకైక నటుడు సంజీవ్‌కుమార్. ఊర్వశి చిత్రంలో శారద సరసన సంజీవ్‌కుమార్ నటించారు. ఇక్కడ శారద గురించి రెండు విషయాలు ప్రస్తావించాలి. నిర్మాత కొప్పరపు సుబ్బారావు నిర్మించిన శ్రీమతి (1966) షూటింగ్ సెట్‌లో నేపథ్యగాయని ద్వారా శారద మలయాళ చిత్రంలో నటించటానికి ఒప్పందం కుదిరింది. ఆ చిత్రమే ‘ఇన్‌ప్రావుగళ్’. ఈ చిత్రం ద్వారా శారద మలయాళ రంగంలో తెరంగేట్రం చేసి మలయాళ చిత్రం ‘తులాభారం’ ద్వారా మొదటిసారి, ‘స్వయంవరం’ చిత్రం ద్వారా రెండోసారి, తెలుగు చిత్రం ‘నిమజ్జనం’ ద్వారా మూడోసారి ఊర్వశి అవార్డు అందుకున్నారు. మూడుసార్లు జాతీయస్థాయిలో ఊర్వశి అవార్డు గెలుచుకున్న ఘనత తెలుగు నటి శారదకు దక్కడం గర్వించతగ్గ విషయం. (ఈ రికార్డును ఇప్పటి వరకూ ఎవరూ సమంచేయలేదు కూడా). ఉత్తర దక్షిణాల కలయిక సింబాలిక్‌గా నిలిచే చిత్రమే ఇక్కడ మీరు చూస్తున్నది. -జాతీయస్థాయిలో అవార్డులు పొందిన సంజీవ్‌కుమార్, శారద మొదటిసారిగా ఒక చిత్రంలో కలిసి నటించటం ఒక విశేషం అయితే, ఆ చిత్రం పేరు ‘ఊర్వశి’ కావటం మరో విశేషం. ‘ఊర్వశి’ చిత్రం సెట్‌లో ఇద్దరు జాతీయ అవార్డు గ్రహీతలు పాల్గొన్నపుడు తీసిన అరుదైన చిత్రమే ఇక్కడ మీరు చూస్తున్నది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717