Others

యాక్షనే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోలు చేసే యాక్షన్ ఎపిసోడ్లు హీరోయిన్లు కూడా చేసి చూపించే కాలం త్వరలోనే ఉందంటోంది బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఎంతసేపూ
అందం చూపించడం, ఆడిపాడటమేనా? యాక్షన్ ఎపిసోడ్లు మనం చేయలేమా? అంటోంది కూడా. ‘నిజానికి యాక్షన్ అద్భుతమైన జోనర్. రీలోడెడ్, డ్రైవ్ చిత్రాలు చేస్తుంటే అర్థమవుతుంది. ఆ జోనరే కంఫర్టబుల్‌గానూ ఉంది’ అంటోంది జాక్వెలిన్. ఇప్పుడు చేస్తున్న సినిమాలు వర్కవుటైతే -బాలీవుడ్‌లో జాక్వెలినే యాక్షన్ ఐకాన్ అయిపోతుందట. ఇటీవలి కాలంలో హీరోయిన్ ఓరియంటెండ్ సినిమాలు, యాక్షన్ డ్రామాలు వస్తున్నాయి. ఇది మంచి మార్పు అంటోంది ఫెర్నాండెజ్. జుడ్వా 2, అకార్డింగ్ టు మాథ్యూ చిత్రాల్లో ఫెర్నాండెజ్ యాక్షన్
ఎపిసోడ్స్ చేస్తోందట. అందుకే యాక్షన్ ఐకాన్‌పైనే దృష్టి పెట్టిందట.