Others

ప్రచారానికి అంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకారంలో మార్పులొచ్చేసినా అంజలి ఫేస్ వాల్యూ మాత్రం తగ్గలేదు. అందుకే -అడపాతడపా సినిమాలు పడుతూనే ఉన్నాయి. ‘ఆ ఒక్క సినిమా నా ఫేట్ మార్చేయనుంది’ అంటూ చాలాకాలంగా చెప్పుకొస్తున్న ‘చిత్రాంగద’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. కాకపోతే -ప్రచారం కోసం అంజలి హైద్రాబాద్‌కు వస్తుందా? రాదా? అన్న దానిపై ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. తమిళ కో-స్టార్ జైతో ‘చెట్టాపట్టాల్’ విషయంలో అంజలి మీద అనేక కథనాలు పుట్టుకురావడంతో మీడియా ముందుకు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. ప్రచార కార్యక్రమాలకు వస్తే మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికే మీడియాలో వ్యక్తిగత గొడవలతో అల్లరై ఇబ్బందులు పడిన అంజలి -ఈసారి దూరంగానే ఉండొచ్చని అంటున్నారు. అయితే, దర్శకుడు మాత్రం లేడీ ఓరియంటెడ్ చిత్రం కనుక ప్రచారానికి అంజలిని తప్పక తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.