Others

పసందైన పసుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పసుపురంగు శుభానికి సంకేతంగా మనం భావిస్తాం. అయితే మనసు ఉల్లాసంగా ఉండటానికి, మంచి మూడ్ రావడానికి పసుపురంగు కారణమవుతోందని ఓ పరిశోధన చెబుతోంది. అందుకే పసుపురంగు అరటిపళ్లన్నా, పచ్చసొనతో ఘుమఘుమలాడే ఆమ్లెట్ అన్నా నోరూరుతుందట. అరటిపళ్ల కేక్‌లన్నా, పసుపురంగుతో కూడిన అనాస, పనస తొనలన్నా నాలుకపై ఉన్న రుచిమొగ్గలు వెంటనే స్పందిస్తాయట. మనకు కావలసిన ముఖ్యమైన డి విటమిన్‌ను అందించడంలో ఈ పసుపువర్ణపు పళ్లు, ఆహార పదార్థాలు కీలకపాత్ర పోషిస్తాయట. హ్యాపీహార్మోన్స్‌గా చెప్పుకునే సెరిటోనిక్ హార్మోన్స్ ఉత్పత్తిలో ఈ తరహా ఆహారం బాగా పనిచేస్తుందని ఈ పరిశోధనలో తేలింది. బ్రిటన్‌కు చెందిన ‘ద హ్యాపీ ఎగ్ కంపెనీ’ ఆధ్వర్యంలో గత ఏడాది నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం తేలిందట. మనం తీసుకునే ఆహారంలో 31 శాతం మేరకు పసుపురంగు పళ్లు, పదార్థాలు మనకు మంచిమూడ్‌ను అందిస్తున్నాయని న్యూరో సైకాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ లూరుూస్ అంటున్నారు. చిన్నారులు ఇష్టపడే బొమ్మల్లో పసుపురంగువి ఎక్కువగా వారిని ఆకర్షిస్తాయని వారు తేల్చారు. పసుపురంగు ఆహార పదార్థాలు, పళ్లలో అరటిపళ్లది అగ్రస్థానం కాగా ఆమ్లెట్‌లది (పచ్చసొనతోకలపి) రెండోస్థానమట. పసుపువర్ణంలో ఉండే మ్యాక్‌చీజ్, ప్యాన్‌కేక్, లెమన్‌కేక్‌లది ఆ తరువాతి స్థానాలన్నమాట. ఇక పసుపువర్ణం తరువాత గోధుమరంగుకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని ఆ స్టడీ తేల్చింది. ఇక బ్లూబెర్రీ రంగును పెద్దగా ఎవరూ ఇష్టపడరని, దాని ప్రభావం తక్కువేనని ఆ నివేదిక తేల్చింది. కాబట్టి పసుపు పదార్థాలను ఓ పట్టుపడితే మన మనసూ, ఆరోగ్యం పదికాలాలపాటు కళకళలాడుతుందన్నమాట.