AADIVAVRAM - Others

భేదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంతువులకి మనుషులకి చాలా భేదాలున్నాయి. అందులో ప్రధానమైనది వివేకం. జంతువులకి వివేకం ఉందో లేదో తెలియదు కానీ వాటికి సంతోషంగా ఉండటం తెలుసు. మనిషికి అన్నీ తెలుసు. కాని సంతోషంగా ఉండటం తక్కువగా తెలుసు.
ఆపదలని గుర్తించడం మనిషికి తెలుసు. అదే విధంగా జంతువులకి తెలుసు. కొన్నిసార్లు మనుషులు గుర్తించినంతగా అవి ఆపదలని గుర్తించకపోవచ్చు. ఈ విశ్వంలో బతకడానికి ఇది అత్యవసరం.
మనిషి తన వివేకాన్ని సంతోషం వైపు మళ్లించకుండా భయం వైపు, ఆందోళన వైపు మళ్లిస్తాడు. ఆపద పొంచి వున్నప్పుడు ఆందోళన చెందడం అవసరమే కానీ ఆపద పొంచి లేనప్పుడు ఆందోళన చెందడం, భయానికి లోను కావడం అర్థరహితం.
ఆధునిక సమాజంలో భయం చెందే సన్నివేశాలు, సంఘటనలు ఎక్కువగా వున్నా మొత్తంగా లేవు. వాటి గురించే ఆలోచించడం వల్ల అవి రెట్టింపు అవుతున్నాయి.
మనం భయాందోళనల నుంచి దూరంగా వుండటానికి, సంతోషంగా ఉండటానికి ఏవో గొప్ప పనులు చేయాల్సిన పని లేదు. చిన్నచిన్న పనులతో కూడా ఆనందాన్ని పొందవచ్చు.
ఆశావహ దృక్పథం అలవరచుకోవాలి. ప్రతి విషయంలోనూ పాజిటివ్ విషయాలని గమనించాలి. మన ఇంటి ముందు విచ్చుకున్న పుష్పాన్ని చూసి ఆనందించవచ్చు. ఉదయిస్తున్న సూర్యుణ్ణి చూస్తూ హుషారు పొందవచ్చు.
మనకు ఎదురయ్యే వ్యక్తుల పట్ల కాస్త కరుణతో వ్యవహరించి ఆనందం పొందవచ్చు. ఎవరైనా ఏదైనా చిన్న మంచి పని చేస్తే అతన్ని ప్రశంసించి అతని కన్నుల్లో ఆనందాన్ని చూడవచ్చు.
ప్రొద్దున మట్టి మీద నీళ్లు చల్లుతుంటే ఆ మట్టి వాసనని పీలుస్తూ ఆనందం పొందవచ్చు. మిత్రుని కరచాలనంతో ఆనందించవచ్చు.
కమ్మటి కాఫీ పరిమళాన్ని ఆఘ్రాణిస్తూ ఆనందం పొందవచ్చు. ఆనందించాలన్న ఆలోచన చాలు. ఎన్నో అవకాశాలని మనకు ఈ సృష్టి కల్పిస్తుంది. ఈ ఆశావహ దృక్పథం ఏర్పడటానికి కొంత ప్రయత్నం చేయాలి.
బాధ, కష్టం అనేవి ఉండవచ్చు. కానీ కన్పించే ఇన్ని ఆనందాల ద్వారా వాటిని అధిగమించవచ్చు.
ఇతరులని సంతోషపెట్టడానికి ఏవో గొప్ప పనులూ, గొప్ప సహాయం అవసరం లేదు. ఓ చిన్న నిజమైన ప్రశంస, ఓ చిన్న చిరునవ్వు చాలు.
టీ పొడి అమ్మే షాపు ముందు నుంచి నడుస్తూ ఆ టీ పొడి వాసనని ఆఘ్రాణిస్తూ ఆనందించవచ్చు.
మన దగ్గరికి వచ్చిన వ్యక్తి కళ్లల్లోకి చూసి చిరునవ్వుతో పలకరించవచ్చు.
సంతోషంగా ఉండటానికి ఎన్నైనా చేయవచ్చు. భయం, ఆందోళననని దూరంగా జరిపే నైపుణ్యాన్ని అలవరచుకోవాలి.
ఎన్ని చేసినా నవ్వడం మాత్రం మర్చిపోవద్దు.