Others

అన్నదానమూ ఓ యజ్ఞమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యజ్ఞమనగా యాగము. హవిస్సు అనగా అగ్నిలో హుతం చేయబడు వస్తువు. యజ్ఞము యొక్క స్వరూపాన్ని బట్టి హవిస్సు మారుతుంది. అగ్నిలో వ్రేల్చెడి సమిధలు (కట్టెలు) కూడా హవిస్సుగానే పరిగణింపబడును. యజ్ఞస్వరూపాన్ని బట్టి ఈ హవిస్సు మారుతుంటుంది. సాధారణంగా యజ్ఞములలో అన్నముగాని పాయసముగాని లేక ఇతర మధుర పదార్థములుగాని మరియొక్క హోమద్రవ్యముతో హుతము చేయబడును.
మానవ శరీరములో యజ్ఞము కడుపులో జరుగుతుంది. కడుపులో వేసే ఆహారమే హవిస్సు. శరీరంలోని జఠరాగ్ని దీనిని హుతం చేయును. అంటే భోజనం చేయుట యజ్ఞం కాదు. తనకు తాను తిన్నది యజ్ఞము ఎంత మాత్రము కాదు. యజ్ఞం చేయు యజమాని అన్నాతురులైన బీదలకు, అనాధలకు, అవిటివారికి, పిల్లలకు, జ్ఞాన పరిపూర్ణులైన సాధు సత్పురుషులకు ముఖ్యంగా ఆకలిగొన్నవారికి భక్తిశ్రద్ధలతో పెట్టిన భోజనం. అది వారి జఠరాగ్నిలో హుతమై యజ్ఞమగును.
యజమానికి వారినుండి ఎలాంటి ప్రతిఫలం పొందాలన్న ఆకాంక్ష ఉండరాదు. సర్వసమర్పణ బుద్ధితో ఆచరించవలెను. యజ్ఞములో వ్రేల్చబడు హవిస్సు పరిపూర్ణ త్యాగబుద్ధితో చేయాలి. అందువలననే యజ్ఞములో హవిస్సు వ్రేల్చేటప్పుడు ‘విష్ణవే స్వాహా’ అని దేవుని పేర సమర్పించి ఆ హవిస్సు అగ్నిలో పడునప్పుడు పరిపూర్ణమైన ఏకాగ్రతతో ‘విష్ణవేదన్నమమ’ అనే మంత్రముతో హుతము వేస్తాము. అంటే ఇది నాది కాదు, కేవలం విష్ణువునకే అను మంత్రముతో సమర్పిస్తాము. ఈ మంత్రము చెప్పనిచో యజ్ఞములో చేయు హోమము కూడా నిష్పలమగును. ‘న-మమ’ అంటే నాది కాదు అను త్యాగబుద్ధితో సర్వసమర్పణ చేయుటయే యజ్ఞము యొక్క ముఖ్యోద్దేశ్యము. యోగి తాను చేయు సర్వకర్మలనూ భగవత్పరముగా జేసి వాటి ఫలితాన్ని తాను పొందకుండా ‘న-మమ’ అను సంకల్పముతో సర్వకర్మ పరిత్యాగము చేయుటయే యజ్ఞ లక్షణము.
గురువు విద్యార్థులకు చదువు చెప్పునప్పుడు విద్యను హవిస్సుగా చేసి వారి మనస్సులోనే అగ్నిలో వ్రేల్చి ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేక భగవదర్పణ బుద్ధితో జ్ఞాన దానము చేసిన అది జ్ఞానయజ్ఞమై అభివృద్ధితో భాసిల్లుతుంది. అట్లే కృషీవలుడు పదును చేసిన దుక్కిలో గుప్పెడు ధాన్యము సర్వసమర్పణ బుద్ధితో త్యాగము చేసిన అవి ఫలించి ఒక్కొక్కటి పదింతలుగా ఫలితాన్నిస్తుంది. రైతు పండించిన ధాన్యమును తానే భుజింపక లోకములోని ప్రజలందరకూ అందించుటయే కృషి యజ్ఞము. సర్వలోక హితముగా చేయవలసిన పవిత్ర యజ్ఞకర్మను స్వార్థపూరతముగావిస్తే ఆ ప్రభావము యజమానికి హాని కలుగజేయును. కావున యజ్ఞ రహస్యమును గుర్తించి లోక శ్రేయస్సుకై ప్రజాహితముకై చేయు కృషి యజ్ఞముగా మారి పాడి పంటలు వృద్ధియై, ధర్మవృద్ధియై ప్రజలు ఆనందైశ్వర్యములతో ఓలలాడుతారు. ధర్మం వృద్ధియై శాంతి సౌభాగ్యాలు సమకూరుతాయి. ధర్మముతో ప్రజలలో స్వార్థం తగ్గి సుఖశాంతులు వెల్లివిరిసి ఆనందముతో జీవిస్తారు.
పర్సపర సహకారమే ‘యజ్ఞ’మని కృష్ణ్భగవానుడు గీతలో విశదపరచాడు. ‘పరస్పర భావయంతః శ్రేయః పరమ వాస్స్యధ’- అనగా ఓ ప్రజలారా, యజ్ఞము ద్వారా పరస్పరం శ్రేయస్సు కాంక్షించి అందరూ లాభం పొందాలి అని అర్థం. అందువలన యజ్ఞమునకు త్యాగం ఎంతో ముఖ్యము. స్వార్థబుద్ధితో చేయు ఏ పని కూడా యజ్ఞం కాదు. సర్వశ్రేయస్సును కోరి త్యాగబుద్ధితో కర్మను చేసినచో అమితమైన యజ్ఞ్ఫలము లభించును. ఇదే యజ్ఞ రహస్యములో ఇమిడియున్న మహత్తర, అద్భుత సాంఘిక సత్యము. రాజకీయ సత్యము. వీటిని విస్మరించటువలననే ఆధునిక సమాజంలో పరస్పర సంఘర్షణలు అంతర్యుద్ధములు విస్తరిస్తున్నాయి. వేదం ‘ప్రజ్ఞానం బ్రహ్మ’, ‘అన్నం బ్రహ్మేతి విద్వాన్’ అని ఘోషిస్తున్నది. అన్నము, విద్య ఉతముగా లభించిన నాడు భారతదేశములో యజ్ఞపురుషుడు ఆనందతాండవమొనరిస్తాడు. ప్రతి వ్యక్తి ఇది గ్రహించిననాడు ఏ దేశమైనా సుఖశాంతులతో వెల్లివిరుస్తుంది.

-పెండెం శ్రీ్ధర్