Others

స్వీటీ సన్నబడిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగ్రశేణి తారగా టాలీవుడ్‌ను ఎడాపెడా ఏలేస్తున్న అనుష్క మళ్లీ -‘జీరో సైజ్’కు వచ్చేసింది. అవును -‘సైజ్ జీరో’ సినిమా కోసం ఊదేసిన బెలూన్‌లా ఉబ్బిన స్వీటీ.. బాహుబలి -2 కోసం గాలితీసేసిన బెలూన్‌లా ‘జీరో సైజ్’కు వచ్చేయడం అభిమానులకు షాకింగే. జక్కన్న తలచుకుంటే బరువైన శిల్పాన్నైనా బాహుబలి పక్కన సూటయ్యేలా చెక్కేసుకుంటాడని అనుకోడానికి -ఇదిగో ఈ పోస్టరే ఎగ్జాంపుల్. అనుష్కను చూపించేందుకే విడుదల చేసిన బాహుబలి 2 పోస్టర్ మీద బలమైన బాణాన్ని సంధిస్తున్న సన్నజాజి స్వీటీని చూస్తే అర్థం చేసుకోవచ్చు. అయితే -స్వీటీ స్లిమ్ వెనుక సిత్రమైన కథ ఉందట. పరోక్షంగా జక్కన్న రివీల్ చేసిన స్టోరీయే అంటున్నారు సినీజనం.
నిజానికి ‘సైజ్ జీరో’ పాత్ర కోసం డెడికేటెడ్‌గా లావైంది అనుష్క. పడిన కష్టం ఫలించకపోవడం ఒక ఎత్తయితే, పెరిగిన బరువునుంచి బయటపడటానికి అష్టకష్టాలు పడుతుండటం మరో ఎత్తు. అనుష్క ఎంత బొద్దుగా ఉందో మొన్నటికి మొన్న వచ్చిన సింగం-3 చెప్పకనే చెప్పింది. సింగం స్క్రీన్ మీద ‘అంత’గా కనిపించిన స్వీటీ -బాహుబలి పోస్టర్‌మీద ‘ఇంత’గా అగుపించే సరికి అభిమానుల్లో సహజంగానే ఆసక్తి పెరిగింది. మునుపటి షేప్‌లోకి స్వీటీని తెచ్చేందుకు జక్కన్న ఏం ట్రిక్ ప్లే చేశాడబ్బా అని అంతా ఆలోచించారు. ఫస్ట్ పార్ట్‌లోని స్టిల్‌ని తెచ్చాడేమో అనుకున్నారు. అసలు విషయం తెలిసుకుని జక్కన్న టీం పనితనానికి ప్రశంసలందిస్తున్నారు. జక్కన్న చెప్పకనే చెప్పిన విషయం ఏంటంటే -‘అంత’లావుగా అనుష్క లేదంటూనే, స్వీట్‌గా చూపించడానికి మాత్రం సిజె ట్రిక్ ప్లే చేశామని ఒప్పేసుకున్నాడట. స్లిమ్‌గా తయారై రమ్మని స్వీటీకి ఎన్నిసార్లు చాన్సిచ్చినా ఆమె వల్ల కాలేదు. నమ్ముకున్న యోగా సైతం దగా చేయడంతో -చేసేదిలేక చేతులెత్తేసింది. వెయిట్ చేయడం తనవల్ల కాదనుకున్న రాజవౌళి -సిజె వర్క్‌లో స్వీటీ శిల్పాన్ని సన్నజాజి తీగలా మార్చేశాడని అంటున్నారు. అవునుమరి -సిజె ఎక్స్‌పర్ట్ దొరకాలేగానీ స్వీటీని ‘ఈగ’లాగా చూపించగలడు, సీతాకోక చిలుకలాగా మెరిపించగలడు. దటీజ్ జక్కన్న.