Others

దేవదాస్ మాట! .. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీ రామారావు ప్రధాన పాత్రలో అందరూ కొత్త నటీనటులతో చేసిన సినిమా ‘తీర్పు’. 1975 అక్టోబరు 2 గాంధీ జయంతినాడు విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడి యువతరాన్ని ఆకట్టుకుంది. ఈ చిత్రం హైదరాబాద్ సుదర్శన్ 35 ఎంఎం థియేటర్‌లో 125 రోజుల విజయోత్సవ సభ కూడా జరుపుకొంది. మరొక విశేషం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ చిత్రానికి వినోదపు పన్ను రద్దు చేసింది. తెలుగు సినీ చరిత్రలో వినోదపు పన్ను రద్దుకాబడిన మొదటి చిత్రం ఇదే. కేవలం ఒక్క రూపాయి ప్రవేశ రుసుంతో సామాన్య ప్రేక్షకుడు అప్పర్ క్లాసులో కూర్చుని కుటుంబ సభ్యులతోపాటు సినిమా చూసే సౌకర్యం ఈ చిత్రం కలిగించింది. తెలుగులో ఒక ప్రబోధాత్మక చిత్రంగా పండిత పామర జనాన్ని ఆకర్షించింది. జంట నగరాలలోని పలు సాంస్కృతిక సంస్థలు ‘తీర్పు’ చిత్ర యూనిట్‌కు అభినందన సభలు ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు.
మద్రాస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్‌లో ఎందరో కొత్త నటీనటులకు శిక్షణ ఇచ్చిన ప్రిన్సిపాల్, అప్పుడప్పుడే తెలుగు తెరకు పరిచయమైన దేవదాస్ కనకాల (ఓ సీత కథ అప్పుడే విడుదలైంది) ఒకానొక సభలో మాట్లాడుతూ కొత్త నటీనటులు ఇలాంటి వినోదపు పన్ను రద్దుకాబడే ప్రభోదాత్మక చిత్రాల ద్వారా పరిచయం కావాలని, ఎన్టీఆర్ వారసులు సైతం పరిశ్రమకు పరిచయమై ఇలాంటి ప్రభోదాత్మక చిత్రాల్లో నటించి తెలుగు తెరను మరింత ప్రకాశవంతంగా తీర్చిదిద్దాలని సభాముఖంగా కోరారు.
అలనాటి దేవదాస్ వాక్కు ఫలించింది. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత 2017లో మరో తెలుగు చిత్రం, ఎన్టీఆర్ వారసుడు నందమూరి బాలకృష్ణ నటించిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలై ప్రభుత్వంచే వినోదపు పన్ను రద్దుకాబడి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అందుకే అంటారు కొందరి నోటి మాట ఏనాటికైనా ఫలించి తీరుతుందని.
సికిందరాబాద్‌లో జరిగిన తీర్పు అభినందన సభలో ప్రసంగిస్తున్న దేవదాస్ కనకాల. చిత్రంలో డాక్టర్ సి నారాయణరెడ్డినీ చూడొచ్చు.

-పర్చా శరత్‌కుమార్ 9849601717