Others

కాశ్మీర్ ముస్లింల శివార్చన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాశ్మీర్ ఎంత అల్లకల్లోలమో వేరే చెప్పనక్కరలేదు. జీలం నదీ తీరంలో వున్న ఒక ప్రాచీన శివాలయానికి ఇరవై ఏడు సంవత్సరాలుగా దూప దీప నైవేద్యాలేగాదు- బూజులు దులిపేవాళ్లు కూడా లేరు. ఇది సంబల్ ప్రాంతంలోని బందీపూర్‌లో వుంది. కాశ్మీర్ పండిట్స్ అంతా వెళ్లిపోయారు కదా- అంచేత ఈ శివరాత్రికి అక్కడ మహమ్మదీయులంతా కాశ్మీర్ పండితులు తిరిగి తమ స్వస్థలాలకు రావాలన్న విజ్ఞప్తి చేస్తూ తమ సంఘీభావాన్నీ, మత సామరస్యాన్నీ అనిర్వచనీయమైన పద్ధతిలో ప్రకటించారు. శివాలయ ప్రాంగణాన్ని తుడిచి, కడిగారు. గుడి అంతటినీ గోపురం మొదలు ద్వారాల దాకా శుచిగా, శుద్ధిగా- తళతళలాడేలాగా శ్రమదానం చేశారు. అలంకరణలు చేశారు.
ఈ శివాలయం శ్రీనగర్‌కి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలోనే వున్నది. కానీ పాడుపడిపోయింది. ఈ శివరాత్రికి స్థానికంగా వున్న ఒక కాంట్రాక్టరు- ఇమ్తియాజ్ అహమ్మద్ పూనుకుని శివుడికి పాలు, పండ్లు, పూలు, మిఠాయిలు వగైరాలతో అర్చనలు తోటి ముసల్మాను కశ్మీరీలతో కలిసి నిర్వహించాడు. ‘‘మేమంతా ఒక్కటే. మా పండితులంతా తిరిగి రావాలి. ఈసారి శివరాత్రి మేము ‘సాయిలా- ఫాయిలా’ నిలబడి చేసుకోవాలి’’ అంటూ నగరమంతా భారీ ర్యాలీలు కూడా నిర్వహిం చారు. పండిట్స్ లేని లోటు తీరేలాగా మేం శివార్చనలు చేసి ప్రసాదాలు పంచాం. ఇక వాళ్లు తిరిగి రావాల్సిందే. అదే మాకు కావాలి’’ అని బందీపూర్‌లోని ముస్లిం నాయకులు- రాజకీయ వాదులు సిగ్గుపడేలాగా నినాదాలు చేశారు. ఇదేవిధంగా శ్రీనగర్‌లోని హనుమాన్ గుడిలోని త్రిముఖ లింగేశ్వరునికి ముస్లిం మహిళలు అభిషేకం, పూజలు నిర్వహించారు. ‘బిలీవిట్ ఆర్ నాట్’ కాలమ్‌లా వున్నది కదూ?