Others

ఆరోగ్యానికి నకిలీ సిగరెట్ల పొగ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో సిగరెట్ల వాడకాన్ని తగ్గించటానికి కేంద్ర ప్రభుత్వం ఏటా చేస్తున్న ‘పన్ను వడ్డింపు’ వికటిస్తోంది. గత పదేళ్లుగా సిగరెట్లపై పన్నుపోటు ధూమపాన ప్రియుల జేబుల్ని కాల్చేస్తోంది. విడిగా సాధారణ సిగరెట్టు పది రూపాయలకు, బ్రాండెడ్ సిగరెట్లు మరీ ఖరీదైపోవడంతో నకిలీ సిగరెట్లు రంగప్రవేశం చేశాయి. కొంతమంది అక్రమార్కులు చవక రకం సిగరెట్లతో మార్కెట్‌ను నింపేస్తున్నారు. గతంలో పన్ను చెల్లించకుండా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పొరుగుదేశాల నుంచి అడ్డదారుల్లో నకిలీ సిగరెట్లు దిగుమతి చేసుకొనేవారు. ఇప్పుడు ఏకంగా దిల్లీ, సూరత్, హైదరాబాద్, చండీగఢ్ లాంటి నగరాల్లో నాసిరకం సిగరెట్లు తయారుచేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయ నష్టం, ప్రజలకు ఆరోగ్య నష్టం కలుగుతోంది. నకిలీ సిగరెట్లు ఒక్కొక్కటి రెండు, మూడు రూపాయలకే లభిస్తున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ప్యారిస్, షూటర్ 555, ఈటిలైట్స్, గరమ్, బాండ్, కూల్ తదితర బ్రాండ్ల సిగరెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఇవి విదేశాల నుంచి దిగుమతి కావడం లేదు. కొంతమంది అక్రమ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా వీటిని తీసుకువస్తున్నారు. స్థానికంగా లభించే నాసిరకం పొగాకు కొనుగోలు చేసి వాటితో సిగరెట్లు తయారుచేసి భారీ అక్రమార్జనకు పాల్పడున్నారు. రంపపు పొట్టును కూడా కలిపి సిగరెట్లు తయారుచేసి మార్కెట్ చేస్తున్నారు. పొగాకు ఉత్పత్తులు వాడడం ఆరోగ్యానికి హానికరమని ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. పొగాకు ఉత్పత్తులు వినియోగించడం ద్వారా క్యాన్సర్, గుండె జబ్బు, నరాల బలసీనతలు, కండరాల బలహీనతలు, ఊపిరితిత్తులు దెబ్బతినడం వంటి వ్యాధులు వస్తాయి. ధూమపానంతో మన దేశంలో ఏటా లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాయి.
సిగరెట్లు తయారైన ఆరు నెలల వరకు మాత్రమే వాటిని వినియోగించాలి. ఆ తర్వాత సిగరెట్లలో ఫంగస్ చేరుకుంటుంది. ఇటువంటి సిగరెట్లు కాల్చడం వల్ల మనిషి ఆయుష్షు త్వరగా ముగిసే ప్రమాదముంది. నకిలీ విదేశీ సిగరెట్ల అక్రమ విక్రయాలపై జిల్లా యంత్రాంగాలు నిఘా పెట్టాల్సి ఉంది. దేశంలో అమలులో ఉన్న ‘సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రొడక్ట్స్ యాక్ట్’ ప్రకారం సిగరెట్లు తయారుచేసే తేదీ, తయారీదారుల చిరునామా ప్యాకింగ్‌పై కచ్చితంగా ఉండాలి. మార్కెట్‌లో లభిస్తున్న డూప్లికేట్ విదేశీ సిగరెట్లపై అటువంటి వివరాలు ఉండవు. హెచ్చరికలతో కూడిన ఊపిరితిత్తుల బొమ్మలు సైతం ఈ సిగరెట్ల ప్యాకెట్లపై ముద్రించాల్సి ఉంది. అధికారులు నిఘా పెంచడం వల్లనే నకిలీ సిగరెట్లను అడ్డుకునే వీలుంది.

- పుట్టా సోమన్నచౌదరి