AADIVAVRAM - Others

సమష్టిగా కదిలారు.. టాయలెట్లు నిర్మించారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్లంతా కాలేజీ విద్యార్థులు. టాయిలెట్లు ఎలా నిర్మించాలో అవగాహన లేనివాళ్లు. అయితేనేం ఆ గ్రామంలో ప్రతి ఇంటికీ ఓ టాయిలెట్ నిర్మించాలనే ఆలోచన మాత్రం ఉన్నవాళ్లు. ఆ గ్రామస్థులకు బహిరంగ ప్రదేశాలే మలమూత్ర విసర్జనకు దిక్కు. ఏ ఒక్క ఇంట్లోనూ టాయిలెట్ లేదు. సూర్యోదయానికి ముందో, చీకటి పడిన తర్వాతో మహిళలు, బాలికలు కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన దుస్థితి. ఇదీ మహారాష్ట్ర పాల్‌ఘర్ జిల్లాలోని కార్వాల్ గ్రామ ప్రజల దీనావస్థ. వారి ఇబ్బందులను ముంబైలోని కిషన్‌చంద్ చెల్లారామ్ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు 2005లో గమనించారు. ఎన్‌ఎస్‌ఎస్ క్యాంప్‌లో భాగంగా ఆ గ్రామానికి వెళ్లినప్పుడు అక్కడి పాఠశాలలో ఒక టాయిలెట్ నిర్మించారు. ఏ ఇంట్లోనూ టాయిలెట్ లేదని విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఎప్పటికైనా ఈ గ్రామంలో ప్రతి ఇంటికీ టాయిలెట్ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. టాయ్‌లెట్లు ఎలా నిర్మించాలో తెలుసుకునేలా చేసింది. రెండేళ్ల వ్యవధిలో 116 టాయిలెట్లను స్వయంగా నిర్మించి ఆ గ్రామానికి బహుమతిగా అందించారు.
2005లో కిషన్‌చంద్ చెల్లారామ్ కాలేజీ విద్యార్థులు ఎన్‌ఎస్‌ఎస్ క్యాంప్ చేపట్టారు. పాఠశాలకు టాయిలెట్ లేదని తెలుసుకుని దాని నిర్మాణం పూర్తిచేశారు. టాయిలెట్ లేని ఇంటిని ఊహించలేమనీ, కాలకృత్యాల కోసం బయటకు వెళ్లాలంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో గ్రహించారు. దీంతో ఆ గ్రామాన్ని తరచూ సందర్శించి గ్రామస్థులతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. టాయిలెట్లు ఎంత అవసరమో వారిలో చైతన్యం తీసుకువచ్చారు. వారిని ఒప్పించడం తొలుత కష్టమైనా క్రమంగా అందరూ అంగీకరించడంతో విద్యార్థులు రంగంలోకి దిగారు. ప్రతి ఆదివారం గ్రామాన్ని సందర్శించి ఉదయం నుంచి సాయంత్రం వరకు టాయిలెట్ నిర్మాణంలో పాల్గొనేవారు. వీరి చొరవతో 2015లో 49 టాయిలెట్లు, 2016లో 67 టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తిచేశారు. దాదాపు 300మంది విద్యార్థులు అలుపెరగకుండా కాయకష్టం చేశారు. గోతులు తవ్వడం, ఇటుకలతో ట్యాంక్ నిర్మించడం వంటి పనులు కూడా స్వయంగా తెలుసుకుని నిర్మించి చూపారు. గతంలో ప్రతి ఆదివారం వెళ్లిన విద్యార్థులు, మూడు నెలలుగా ప్రతిరోజూ గ్రామానికి వెళుతూ తుది మెరుగులు దిద్దుతున్నారు. గ్రామస్థుల సహకారం మరువలేనిదని, ఆహారం, మంచినీరు స్వయంగా అందించారని వాలంటీర్లు సంతోషం వ్యక్తం చేశారు. చదువుకునే పిల్లలు తమకోసం ఇంతటి కార్యక్రమానికి పూనుకోవడంతో గ్రామస్థుల ఆనందానికి అవధుల్లేవు. మహిళలు, బాలికల సంగతి చెప్పక్కర్లేదు. నమ్మశక్యం కాని విజయాన్ని సొంతం చేసుకున్న విద్యార్థులు ఇప్పుడు నిరక్షరాస్యతపై దృష్టిసారించారు. సమష్టిగా పూనుకుంటే దశాబ్దాల నాటి సమస్య కూడా రోజుల్లో పరిష్కారమవుతుందనేందుకు ఇది చక్కటి ఉదాహరణ. *