Others

తూర్పు అంటార్కిటికాలో ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలు వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల దృష్ట్యా అంటార్కిటికా సురక్షిత ప్రాంతమేనా? ఒకప్రక్క పశ్చిమ అంటార్కిటికాలో అంచనాలను మించిన వేగంతో పెద్దపెద్ద మంచు ఫలకాలు కరుగుతున్నాయి. మరోప్రక్క తూర్పు అంటార్కిటికాపై జరుగుతున్నా పరిశోధనలు సముద్ర మట్టం గురించిన ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో సంభవించబోయే పర్యావరణపరమైన పెనుమార్పులను వెనక్కి మార్చలేమని శాస్తవ్రేత్తలు అంటున్నారు. భూగోళంపై ఆర్కిటిక్ ఉత్తరాగ్రాన ఉన్న మంచు ఇతర ప్రాంతాలలోని మంచుకన్నా రెట్టింపు వేగంతో కరుగుతోంది. అయితే దక్షిణ ధృవం వద్ద కొన్ని వేల కిలోమీటర్ల మేర పేరుకుపోయిన మంచు కరగనంతవరకు భూగోళానికి వచ్చిన ప్రమాదమేమీలేదని శాస్తవ్రేత్తలు అభిప్రాయపడుతూ వచ్చేరు. కానీ అంటార్కిటికాకి ఉత్తరాన గల అంటార్కిటిక్ పెనిన్సులా వద్ద ఇటీవలి సంవత్సరాలలో పెద్దపెద్ద మంచు చరియలు కరుగుతున్న తీరు శాస్తవ్రేత్తలతో భూపర్యావరణ భద్రతపట్ల గల ధీమాను కుదిపేస్తోంది.
తూర్పు అంటార్కిటికాలో చాలా విస్తారంగా, నిశ్చలంగా ఉన్న మంచు ప్రాంతాలు కనిపించవచ్చు. కానీ ఇక్కడి మంచు కరగడం మొదలుకావడం ఎంతో దూరంలో లేదని జర్మనీలోని పోస్ట్‌డామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ క్లైమేట్ ఇంపాక్ట్ రీసెర్చ్(పి.ఐ.కె.)కి చెందిన పర్యావరణ నిపుణులు అంటున్నారు. ‘నేచర్ క్లైమేట్ ఛేంజ్’ పత్రిక ప్రచురించిన ఒక వ్యాసంలో ఇప్పుడిప్పుడే తూర్పు అంటార్కిటికాలో మంచు కరగడం మొదలయ్యిందనీ, ఫలితంగా భవిష్యత్తులో సముద్రమట్టం పెరుగుదలను నిరోధించడం ఎవరితరం కాదనీ ఈ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పశ్చిమ అంటార్కిటికాలో పైన్ ఐలాండ్ గ్లేసియర్ అతి పెద్ద మంచుకొండ. 2015 విరిగిపడింది. దీని ప్రభావం తూర్పు అంటార్కిటికాపై పడబోతోంది. ‘తూర్పు అంటార్కిటికాలోని మంచుకొండలు కరగబోవని గతంలో భావించాం. అవిగాని కరగడం మొదలైతే సముద్రమట్టం అనూహ్యంగా పెరిగి న్యూయార్క్, టోక్యో, మొంబై వంటి నగరాలు ముంపునకు గురౌతాయి. గతంలో పశ్చిమ అంటార్కిటికాలో మంచు కరగడంవల్ల మాత్రమే భూగోళానికి ముప్పుఉందని అనుకున్నాం. కానీ తూర్పు అంటార్కిటికాలో మంచు కరిగితే అంతకంటే పెద్ద ప్రమాదమే సంభవిస్తుంది. ఎందుకంటే అక్కడ పది రెట్లు ఎక్కువగా మంచు పేరుకుని ఉంది’’అని అండర్స్ లెవర్మాన్ అంటారు. ఈయన కొలంబియా యూనివర్సిటీకి చెందిన పర్యావరణ శాస్తవ్రేత్త.
‘తూర్పు అంటార్కిటికాలో ‘విల్క్స్ బేసిన్’ ఒకపక్కకి ఒరుగుతోంది. దానివల్ల అందులోని నీళ్ళు సముద్రంలోకి ప్రవహించే అవకాశం ఉంది’’ అని మత్తియాస్ మెంగెల్ అంటారు. ఈయన ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐ.పి.సి.సి.) వెల్లడించిన నివేదిక రూపొందించిన వారిలో ఒకరు.
తూర్పు అంటార్కిటికాకి సంబంధించి రూపొందించిన భౌగోళిక నమూనాలను అధ్యయనం చేయగా మరో ఐదువేల నుండి పదివేల సంవత్సరాలలో ఇక్కడ మంచు పూర్తిగా కరిగిపోతుందనీ, ఇది సుదీర్ఘకాలమే అయినా మంచు కరిగిపోవడం మాత్రం అనివార్యమైన పరిణామం అనీ మత్తియాస్ మెంగెల్ అంటారు.
ఇప్పటికే ఐ.పి.సి.సి. నివేదిక ఈ శతాబ్దం అంతానికి సముద్ర మట్టం 16 సెంటీమీటర్ల ఎత్తుకు పెరుగుతుందని అంచనావేసింది. దీనివలన భౌగోళం మీదనున్న చాలా తీరప్రాంతాలు ముంపునకు గురౌతాయి. దీనికన్నా అదనంగా ఇంకా ఎలాంటి నష్టం వాటిల్లుతుందన్న విషయంపై శాస్తవ్రేత్తలు ఎక్కువగా దృష్టిపెడుతున్నారు.

- దుగ్గిరాల రాజకిశోర్