Others

పెళ్లిఖర్చు నియంత్రణ సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలో అత్యధికంగా ఆహార పదార్థాలు వృథా అవుతున్న దేశాలలో భారత్‌దే అగ్రస్థానం. ఇటీవలి కాలంలో మన దేశంలో వివాహాలను ఆర్భాటంగా జరపడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. తమ దర్పం, హోదా చాటుకోవడానికి శుభకార్యాల సందర్భంగా ఏర్పాటుచేసే భోజనాలకు లెక్కకుమించి ఖర్చు చేస్తున్నారు. విందులో పదుల సంఖ్యలో ఆహార పదార్థాలు వడ్డించడం, చాలామంది అతిథులు వాటిని తినలేక వదలివేయడం జరుగుతోంది. గతంలో శుభకార్యాలకు వెళ్ళే సమయంలో వస్తువులు లేదా నగదు రూపంలో కానుకలు ఇచ్చేవారు. ఇపుడు ట్రెండ్ మారిపోయింది. వివాహ ఆహ్వాన పత్రికలో ‘ఎటువంటి బహుమతులు, కానుకలు స్వీకరించబడవు’ అని పేర్కొంటున్నారు. అయితే, అతిథులకు బహుమతులు అందజేసి తమ హోదాను కొంతమంది గొప్పగా చాటుకుంటున్నారు. వివాహాలను అంగరంగ వైభవంగా చేయడానికి అమ్మాయిల తల్లిదండ్రులు పోటీపడటంతో లెక్కకుమించి కల్యాణ మండపాలు వెలిశాయి. పెళ్లి సందర్భంగా ఊరేగింపులు, బ్యాండ్ మేళం, సాంస్కృతిక ప్రదర్శనలు, డి.జె, లైటింగ్, బాణసంచా వంటి ఆర్భాటాలు చేస్తున్నారు. చేతినిండా డబ్బుంటే ఘనంగా పెళ్ళిచేయడం సులువైన పని. కల్యాణ మండపం, శుభలేఖల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు, అలంకరణ, అతిథులను ఆహ్వానించడం, భోజనాలు, లైటింగ్ తదితర పనులన్నింటినీ చూసే సంస్థలు ఎన్నో పుట్టుకువచ్చాయి. ఫలితంగా వివాహ ఖర్చులు నానాటికీ పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో పెళ్లిఖర్చును నియంత్రించాలంటూ త్వరలో లోక్‌సభలో ఒక బిల్లు చర్చకు రానుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వివాహాది శుభకార్యాల ఖర్చు నియంత్రిస్తూ ఇప్పటికే ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. పెళ్లికి ఎంతమంది అతిథులను ఆహ్వానించాలనే అంశాన్ని సైతం నిబంధనల్లో పేర్కొన్నారు. ఆడపిల్లకు వివాహం చేసేవారు ఐదువందలు, కుమారుడికి పెళ్లి చేసేవారు నాలుగువందల మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలి. అంతకన్న ఎక్కువ మంది అతిథులను ఆహ్వానిస్తే నేరం అవుతుంది. నిశ్చితార్థం, పుట్టిన రోజు వేడుకలు తదితర కార్యక్రమాలకు వందకు మించి అతిథులను ఆహ్వానించరాదు. భోజనాలలో శాఖాహారం అయినా, మాంసాహారం అయినా మొత్తం ఏడు ఐటమ్స్‌కు మించకూడదు. స్వీట్స్ మాత్రం రెండురకాలు ఇవ్వవచ్చు. ఆహ్వాన పత్రికతోపాటు గిఫ్ట్‌లు ఇవ్వడం నేరం. ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడదు. చెప్పుకోవడానికి ఈ చట్టం బాగుంది. అమలులో ఎంతవరకు సాధ్యం అనేది ప్రశ్నార్థకమే.
జమ్మూ కాశ్మీర్‌లో ఇటువంటి చట్టం తీసుకురావడం ఇదే మొదటిసారి కాదు. వివాహాది శుభకార్యాలలో ఖర్చును నియంత్రిస్తూ ప్రభుత్వం 1960లో ఒక చట్టం తీసుకువచ్చింది. అది అమలైన జాడ మాత్రం లేదు. 1990లో మిలిటెంట్లు వివాహాది శుభకార్యాలలో ఖర్చును నియంత్రించాలంటూ ఫత్వా జారీ చేసినా ఎవరూ పట్టించుకోలేదు. తిరిగి 2004లో కాశ్మీర్ ప్రభుత్వం మరోసారి చట్టం చేసినా ఫలితం దక్కలేదు. అదే చట్టాన్ని ఇపుడు అమలు చేస్తున్నట్లు జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజల్లో మార్పురానంత వరకూ శుభకార్యాలలో ఖర్చును నియంత్రించడం సాధ్యం కాదు. తాము సంపన్నులమని చాటి చెప్పుకోవడానికి కొందరు వివాహాది శుభకార్యాలను వినియోగించుకొంటున్నారు. అనవసర ఖర్చును తగ్గించుకొని, ఆ డబ్బును పేదల సంక్షేమానికి వినియోగించడం మంచిది.

- పి.్భనుశంకర్