Others

వసంతోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మీయానురాగాలను
రంగుల్లో రంగరించి
హోలీ అంటూ...
ముఖచిత్రంపై
కారికేచర్...
శిశిరమున ఆకురాలి
కామదహనమై...
వసంతాగమన ప్రాభవాన
తరువులు కొత్త చిగురులు తొడగి
ప్రేమ చిగురించి
వసంతోత్సవమై...
ప్రకృతి సత్కారమై
అడవి అంతటా
గోగుపూల అరుణ కాంతులైన
ఆకుపచ్చని పండుగ...
పొద్దుతిరుగుడు పూలు (కర్షకలోకం)
పసుపుకొమ్ము రాశిగపోసి
నేల తల్లికి పారాణిగా పూసేరోజు...
రాధేరాధేరాధే రాధేగోవిందా
బృందావనచందా...
గోపికలు భక్తిపారవశ్యంలో
ఓలలాడిన రోజు...
రేతిరి రేడు...
నిండు చందమామ
అంబరాన వెలుగుపూలు పూయించి
కలువలపై పసిడి పున్నమి వెనె్నలలను
కురిపించే రోజు...
ఆనందాన్ని స్వంతం చేసుకొని
ఇంద్రధనస్సు రంగులు
గాలి కెరటమై ఎగిసిపడి
ఒళ్ళంతా తడిసి ముద్దయి
హోలీరహోలీ
చమకేలీ రహోళీ అంటూ...
వేడెక్కిన రక్తపు బాటళ్లు (కాళ్లు)
దోమార్ తీన్మార్ డప్పుకు దరువేస్తూ
జోష్‌గా ఊగే రంగుల పండుగిది...
ఈ గాలినడుగు చెబుతుంది
ఈ నీటినడుగు చెబుతుంది
ఈ నేలనడుగు చెబుతుంది
విరబూసిన నవ్వులనడుగు చెబుతాయి
హోలీ అని...

- మడిపల్లి హరిహరనాథ్ 96035 77655