Others

పరమశివుడు.. కృపావత్సలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తామస భక్తికి ఉదాహరణగా రావణుణ్ణి చెప్పుకుంటారు. ఈ రావణుడు గొప్ప తపస్సు చేశాడు. శివునివల్ల ఎన్నో వరాలు పొందాడు. తన బాహుబలంతో కైలాసానే్న కదిలించాడు. దిక్పాలురందరికీ రావణుడంటే భయం కల్గించాడు. తన తమ్ముడైన కుబేరుణ్ణి శాసించి లంకానగరాన్ని తీసేసుకున్నాడు. త్రిలోకా ధివీరుడుగా ప్రశంసలందు కోవాలను కొన్నాడు. మానవులంటే చులకనభావాన్ని పెంచుకున్నాడు. ఆ మానవునిగానే మహావిష్ణువు పుట్టి రాముడిగా ఎదిగాడు. ఆ రాముని భార్యను రావణుడు అహంకారంతో అపహరించాడు. ఆమెకు ఎన్నో ప్రలోభాలు పెట్టాడు. అయనా సీతమ్మ రామనామాన్ని వదలక జపించేది. ఆ తల్లి మనోభిరాముడు చివరకు రావణుని మట్టుపెట్టాడు. అందుకే అహంభావులకు, గర్వోన్నతి వారికి శివానుగ్రహం ఉన్నా ఆ శివుడే మరోరూపంలో తుదిముట్టిస్తాడు. ఎంత ఉన్నతి సాధించినా అణిగిమణిగి ఉన్నప్పుడే భగవంతునికి ప్రీతి పాత్రులవుతారు. పరమేశ్వరుడిని పూజించడానికి స్వపరభేదాలు కాని హెచ్చుతగ్గులు కాని లేవు. అంతేకాదు నరులు, సురులు, పశువులు అన్న తేడా కూడా లేదు. ఎవరు శివనామాన్ని జపించినా వారి కోరికలను ఈడేర్చేవానిగా శివుడు ప్రఖ్యాతి పొందాడు. తన్ను తనవానిగా భావించి తాను కష్టపడుతున్నానుకొంటూ మూఢభక్తితో తనకు కన్నులు సమర్పించిన కన్నప్పను ఆశీర్వదించిన వాడు శంకరుడు. అల్పాయుష్కుడైన మార్కండే యుని భక్తికి మెచ్చి అనల్పకల్పాల ఆయుష్షును ప్రసాదించినవాడు పరమేశ్వరుడు. అపారకృపా వత్సలుడు. అలాంటి పరమేశ్వరుడు తనను ఆరాధించిన సాలీడు, పాము, ఏనుగు కూడా తనకు అత్యంత ప్రీతిపాత్రులని, వారి పేర్లను సార్థకం చేస్తూ శ్రీకాళహస్తీశ్వరునిగా ప్రాదుర్భవించినవాడు శంకరుడు.

- సాయకృష్ణ