Others

నాకు నచ్చిన చిత్రం-- ప్రేమమందిరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై డి రామానాయుడు అందించిన ఆణిముత్యం ‘ప్రేమమందిరం’. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కథానాయకునిగా గ్లామర్ క్వీన్ జయప్రద హీరోయిన్‌గా నటించిన చక్కని ప్రేమకథా చిత్రం. నిజానికి అలా చెప్పడం కంటే, రాజా జమీందారీ వ్యవస్థలో నడిపిన ప్రేమ కథా కావ్యం అనడం సబబు.
నాటి దేవదాసి కుటుంబంలోని వేశ్యల జీవితాల అనుబంధాలను దర్శకుడు చూపించిన తీరు బాగుంది. వేశ్యలకు మనసుంటుందని, రాజరికపు మనుషుల మనస్తత్వాలలోని వైవిధ్యం నటీనటుల హావభావాలు బహుచక్కగా పండినాయి. రాజరంజనిగా నిర్మల, ఆంగ్ల రంజనిగా సూర్యకాంతం, సభారంజనిగా రాజసులోచన మామధురీ రంజనిగా జయప్రద నాలుగుతరాల ప్రతినిధులుగా నిలచి పాత్రలకు నిండుదనం చేకూర్చారు. విలనిజంతో కూడిన పాత్రల్లో గుమ్మడి ఇమిడిపోయారు. అందమైన లొకేషన్లతో వీనుల విందయిన సంగీతంతో సన్నివేశాలకు తగిన పాటలు సినారే, వేటూరి, ఆరుద్రలు ఎంతో బాగా రచించారు. నాగేశ్వరరావు ప్రేమ సన్నివేశాల్లో తనకుతానే సాటి అనిపించుకొన్నారు. అందాల తారగా జయప్రద పాటలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో ఓ పువ్వులా వికసించింది. చక్కని నవ్వులతో పరిమళించింది.
తారాబలం, సాంకేతిక బలం, కథాబలం- దర్శకత్వ ప్రతిభకు నిలువుటద్దంగా నిలిచివున్న అపురూప ప్రేమకథా చిత్రం ‘ప్రేమ మందిరం’.
నిర్మాతకు, దర్శకునిగా, గీత రచయితలకు సంగీతకారులకు పేరునితెచ్చిన చిత్రం ‘ప్రేమమందిరం ఇదే ప్రేమమందిరం’, ‘తొలిసారి పలికెను హృదయం’ పాటలు ఇప్పటికీ వినిపిస్తే ఎంత బాగున్నాయనిపిస్తుంది.

-కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్