Others

బాలింతలకు బ్లూబెర్రీ భేష్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురిటి నొప్పుల బాధ మాటల్లో వర్ణించలేని వేదన. అలాంటి బాధను సైతం పంటి బిగువున ఓర్చుకునే తల్లులు పండంటి బిడ్డను పొత్తిళ్లలో చూసుకోగానే మురిసిపోతూ అంతకుముందు పడిన బాధనంతా మర్చిపోతారు. కాని దురదృష్టవశాత్తు ప్రసవవేదన సందర్భంగా భావోద్వేగాలు వెల్లువెత్తి తల్లుల మెదడపై తీవ్ర ప్రభావం చూపుతాయని కెనడాలో జరిగిన తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ సమయంలో వారికి తాజా పండ్ల రసాలు ఇవ్వమని చెబుతున్నారు. పథ్యం పేరుతో వారికి సరైన ఆహారం ఇవ్వరని, కాని ప్రసవించిన తరువాత తాజా పళ్లు లేదా పళ్లరసాలు ఇస్తే మంచిని వారు చెబుతున్నారు. వీటిల్లో కూడా బ్లూబెర్రీ పళ్లు లేదా వాటి రసాన్ని ఇస్తే మెదడుకు కావల్సిన ఆక్సిజన్ అందిస్తాయని, అందువల్ల బాలింతలు డిప్రెషన్ వంటి మానసిక జబ్బులుబారిన పడరని కెనడాకు చెందిన నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ నివేదిక తెలియజేస్తోంది. తల్లుల్లో విచారం తాలుకా ఛాయలు కూడా తొలగిపోవటానికి బ్లూబెర్రీ పళ్లు బాగా ఉపకరిస్తాయని అంటున్నారు. 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న 41 మంది మహిళలపై కెనడాకు చెందిన సెంటర్ ఫర్ అడిక్షన్ అండ్ మెంటల్ హెల్త్ ఇన్ టోర్నో టో సంస్థ శాస్తవ్రేత్తలు పరిశోధనలు చేశారు. వీరంతా తొలిసారి అమ్మ అయినవారే. ప్రసవం తరువాత వారికి మూడు రోజుల పాటు బ్లూబెర్రీ జ్యూస్ అందించారు. ఈ జ్యూస్ ఇచ్చిన సందర్భంలో వారికి ఎలాంటి విశ్రాంతి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ వారి మానసిక స్థితి ఎంతో మెరుగ్గా ఉన్నట్లు గుర్తించారు. డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతుల నుంచి బయటపడినట్లు గుర్తించారు. పోషకాలను సమృద్ధిగా అందించే పళ్లు, పళ్లరసాలు ఇవ్వటమే సరైన టీట్‌మ్రెంట్ అని చెబుతున్నారు. దీని వల్ల మానసిక స్థితిగతుల్లో మార్పులు తీసుకురావచ్చని ఈ పరిశోధనల్లో వెల్లడైనట్లు డాక్టర్ జెఫ్రీ వెల్లడించారు. కాబట్టి ప్రసవించిన తరువాత పదిరోజుల పాటు బాలింతలకు ఈ బ్లూబెర్రీ జ్యూస్ తాగిస్తే మంచిదంటున్నారు.