Others

నిఘా నేత్రం.. ఉంటే ధైర్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి వచ్చేసింది. దొంగలు విజృంభించే కాలమిది. వేసవి ఉక్కబోతతో ప్రజలు డాబాలపైన, ఆరుబయట నిద్ర కు ఉపక్రమిస్తుంటారు. సెలవులని పలు కుటుంబాలు సొంతూళ్ళు, విహార యాత్రలకు వెళుతుంటాయ. గుట్టుచప్పుడు కాకుండా చోరులు అందినకాడికి దోచుకువెళ్ళే ప్రమాదం ఉంది. వీటిని నియంత్రించాలంటే కెమెరా కన్ను ఉండాల్సిందే. చోరీ జరిగితే ఆధారాలు ఇచ్చే వ్యవస్థే ఈ నిఘానేత్రం. సి.సి కెమెరాలు ఏర్పాటుచేసుకుంటే నేరాల నియంత్రణ, నిందితుల గుర్తిం పు, వారి సమాచారం సేకరించడానికి వీలవుతుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ యాక్ట్ 2013 ప్రకారం ప్రజా భద్రత చట్టం కింద ప్రతి వందమంది ఉండేచోట సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకోవచ్చు.
అందుబాటులో ఎనె్నన్నో
అత్యాధునిక సిసి కెమెరాలు మన మార్కెట్‌లోనూ అందుబాటులో ఉన్నాయి. సమారు 10-60 మీటర్ల వరకూ రికార్డు చేసే అనేక పరికరాలు మార్కెట్‌లో రూ.6 వేల నుంచి రూ.30 వేల వరకూ లభిస్తున్నాయి. కొన్ని కెమెరాలు చీకట్లో సైతం చక్కటి క్లారిటీతో దృశ్యాలను రికార్డు చేస్తాయి.
సిసి కెమెరాలు ఏర్పాటుచేసుకుని పవర్ సప్లయ్ బాక్స్‌ను డిజిటల్ వీడియో రికార్డర్‌కు అనుసంధానం చేసుకునే అవకాశం ఉంది. దీని ద్వారా చిత్రీకరించిన వీడియో అంతా భద్రంగా రికార్డు అయ్యి ఉంటుంది.
ఇంటర్‌నెట్‌కు సిసి కెమెరాలను అనుసంధానం చేసుకుని ప్రత్యేక లాగిన్‌తో సెల్‌ఫోన్ కూడా చూడవచ్చు.
ఐవిఆర్ బుల్లెట్ విత్ మెటల్ కెమెరా, ఐవిఆర్ బుల్లెట్ విత్ ఎల్‌ఇడి, చీకట్లోకూడా చిత్రీకరించే ఐఆర్ డోమ్ కెమెరా.. ఇలా వందలాది రకాలు అందుబాటులోకి వచ్చాయి.
డోర్ వీడియో ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వచ్చిందెవరో తెలుసుకుని ఇంటి తలుపులు తీయవచ్చు. ఇంట్లో లేని సమయంలో కూడా ఎవరైనా వచ్చి తలుపుకొట్టినా.. ఇంటికి వచ్చినా ఈ కెమెరాలో చిత్రాలు నిక్షిప్తమై ఉంటాయి.

- నీలిమ సబ్బిశెట్టి