Others

విద్యా ప్రమాణాలు పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటిష్ వారు మన దేశంలో అడుగుపెట్టాక సంప్రదాయ విద్య నశించింది. దేశమంతటా వారి పద్ధతిలో విద్యావిధానం అమలులోకి వచ్చింది. జ్ఞానార్జన సంగతి ఎలా ఉన్నా, ఆనాటి చదువు ఉద్యోగాలకు పనికి వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక మన విద్యాలయాల పరిస్థితి మారిపోయింది. ఇటీవలి కాలంలో విద్యా వ్యవస్థలో ప్రమాణాలు, విలువలు పతనమై పోయి కొత్త పోకడలు రాజ్యమేలుతున్నాయి. చాలా చోట్ల విద్యార్థులను రాజకీయ నాయకులు వారి స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారు. విద్యార్థులకు చదువే ప్రధానం. ప్రభుత్వ విధానాలను సమర్ధించడం, వ్యతిరేకించడం వీరి పనికాదు. అవసరమైతే చదువు ముగిశాక వారు రాజకీయాలలో ప్రవేశించవచ్చు. కానీ, అనేక విశ్వవిద్యాలయాల్లో రాజకీయ పార్టీలకు అనుబంధంగా విద్యార్థి సంఘాలు బయల్దేరాయి. విద్యార్థులు ఆందోళనల్లో, అల్లర్లలో పాల్గొంటున్నారు. చదువుకునే పిల్లలు వీధుల్లో తిరుగుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? వారిని ఎందుకు మందలించడం లేదు? విద్యాలయాల్లో అలజడులకు, హింసాత్మక చర్యలకు విద్యార్థులు ఎందుకు పాల్పడుతున్నారు? విద్యాసంస్థల్లో అరాచకాలు, అసాంఘిక కలాపాలు జరిగితే నిషేధించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అక్కడకు పోలీసులు అడుగు పెట్టవలసిన అవసరం ఎంతమాత్రం రాకూడదు.
మరోవైపు పరీక్షల్లో మాస్ కాపీయింగులు, పేపరు లీకేజీలు సర్వసాధారణం అయిపోయాయి. పరీక్షలు ఒక ప్రహసనంగా మారిపోతున్నాయి. ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరచడం ఏమిటి? ఈ పరీక్షలు చదువుకి ఎంతమాత్రం కొలబద్దలు కావు. చదువువల్ల శీలసంపద, విచక్షణ పెరగాలి. ప్రస్తుత పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.
‘విద్యార్థి’ అనే పదాన్ని ఇప్పుడు మార్చాలేమో! మార్కులు, ర్యాంకులు కోరుకునేవారికి ఈ పదం తగదు. వివేకానందుని బోధనలను పాఠ్యాంశాలుగా చేర్చకూడదు, ఉపనిషత్తుల్లోని గురుశిష్య సంబంధాలను గురించి బోధించకూడదు. టీచర్లు, పేరెంట్స్ ఆదర్శప్రాయంగా ఉండాలి. విద్యార్థికి ప్రాథమిక విద్య పునాది వంటిది. అది ఇప్పుడు బీటలు వారింది. ఒకటవ తరగతి నుంచే ఇంగ్లీషు మీడియమ్ ఏమిటి? విద్యారంగంలో ప్రైవేటు యాజమాన్యాల ఆధిపత్యం నానాటికీ పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు పేదవర్గాల విద్యార్థులు సైతం ఆసక్తి చూపడం లేదు. చాలా గ్రామాల్లో తగినంత మంది విద్యార్థులు లేక ప్రభుత్వ పాఠశాలలు మూత పడుతుండగా, ఇంగ్లీష్ మీడియం కానె్వంట్ల పట్ల తల్లిదండ్రులు మోజు పెంచుకుంటున్నారు.
చదువు ధ్యేయం ఉద్యోగమే కాదు. చదువుకున్న అందరికీ ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. అనేక వృత్తులున్నాయి, వివిధ రకాల వ్యాపారాలున్నాయి. వాటిలో ప్రవేశించవచ్చు. మార్పులు క్రమంగా రావచ్చు. విద్యను వ్యాపార వస్తువుగా చూడడం తొలగిపోవాలి. ఇందుకు అవసరమైన మార్గాలు అనే్వషించాలి. ఇటీవల ఢిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లోని విశ్వవిద్యాలయాల్లో వివిధ విద్యార్థిసంఘాలు ఘర్షణ పడడం సిగ్గుచేటు. చదువుకు ఆటంకం కలిగించే రాజకీయ పార్టీల నేతలను, విద్యార్థి సంఘాల నేతలను వర్సిటీల్లోకి అనుమతించరాదు.

- వేదుల సత్యనారాయణ