AADIVAVRAM - Others

సూక్ష్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచానికి మనం ఏమి ఇస్తామో ప్రపంచం మళ్లీ అదే మనకు ఇస్తుంది. ఓ నిర్జన ప్రదేశంలో గట్టిగా అరిస్తే మనకు అదే శబ్దం తిరిగి విన్పిస్తుంది. ఈ సూక్ష్మం చాలా మందికి తెల్సిందే. కానీ ఈ విషయాన్ని తమ జీవితాలకి అన్వయించుకోకుండా చాలామంది బాధపడుతూ ఉంటారు.
జీవితం అంటే ఇవ్వడం తిరిగి పొందడం. ఈ సూక్ష్మాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు.
- పక్షి రెక్కలు విరిచి అది ఎగరాలని అనుకుంటే అది ఎగరగలదా?
- ఎదుటి వారి హృదయాన్ని గాయపరిచి వాళ్లు మనపై ప్రేమని పంచాలని కోరుకుంటే ప్రేమని పంచగలరా?
- ఎదుటి మనిషిలో చెడునే చూసి అతను మనలో మంచిని చూడాలంటే అతను చూడగలడా?
ఇట్లా ఎన్నో ఉదాహరణలని చెప్పవచ్చు. జీవితం అంటే ఇవ్వడం, తిరిగి పొందడం.
ఈ ప్రపంచానికి మనం చెడుని ప్రసాదించి మనం మంచిని కోరుకుంటే లభిస్తుందా?
ఈర్ష్యనీ అసూయనీ మనం ఇతరులకి ఇచ్చి మనం ప్రేమ కావాలని కోరుకుంటే మనకు లభిస్తుందా?
ఈ ప్రపంచం ఓ నిర్జన ప్రదేశంలో మన అరుపు లాంటిది. ఓ అద్దం లాంటిది. మనం ఎలా ఉన్నామో దానే్న చూపిస్తుంది.
ప్రేమ కావాలని అనుకుంటే ఇతరులకి మనం ప్రేమని ప్రసాదించాలి.
కరుణ, జాలి కావాలని అనుకుంటే మనం కరుణ, జాలిని పంచాలి.
ఈ ప్రపంచంలో - అంత పెద్ద మాట ఎందుకు గానీ - మన జీవితంలో పాజిటివ్ మార్పు రావాలని అనుకుంటే మనం మార్పునకు ఇష్టపడాలి.
ఈ చిన్న సూక్ష్మాన్ని గ్రహిస్తే జీవితం ఆనందమయంగా మారే అవకాశం ఉంది.

- జింబో 94404 83001