Others

అక్షరరమ్యత నొందిన పాశురవైభవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుప్పావై పాశుర వైభవం
రచన: పింగళి పాండురంగారావు
వెల : అమూల్యం
ప్రతుల ప్రాప్తిస్థానం
సాహితీ మంజరి 38వ ప్రచురణ
8.71, లాయరు పేట,
ఒంగోలు - 523002
మొబైల్ : 9440554113
**
విష్ణుచిత్తుడు తన పేరుకు తగ్గట్టుగా సదా మహావిష్ణువును చిత్తంలో ధ్యానిస్తూ ఉండేవాడు. భగవన్నీలలు బహుచిత్రాలు కదా. ఆ విష్ణుచిత్తునికి తులసివనంలో ఓరోజు తులసి మొక్కలు పాదులు తీస్తుంటే ఓ శిశువులభించింది. విష్ణుచిత్తుడు పరమానందంతో ఆ బిడ్డను పొత్తిళ్లలోకి తీసుకొని కోవై అని పేరు పెట్టుకొన్నాడు. భగవంతుని ప్రసాదంగా తనకు లభించందీ బిడ్డ అని అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. తనకిష్టమైన పాండురంగని గూర్చి శ్రీమహావిష్ణువు అవతార విశేషాలను, ఆయన మహిమలను కథకథలుగా ఆ కోవై కి రోజూ చెప్పేవాడు. తండ్రి దగ్గర ఆ సంగతులన్నీ విని భగవంతుని లీలను భగవంతునిపై అపారమైన ప్రేమను పెంచుకుంది. దినదిన ప్రవర్థమానమై ఆ బిడ్డ యుక్తవయస్కురాలైంది. విష్ణుచిత్తుడు ఆమెకు వివాహం చేయాలని సంకల్పించాడు. ఆసంగతి తన కుమార్తెతో ముచ్చటించాడు. ఆ కోవై ‘‘తండ్రీ నేను ఆ రంగని మనసారా ప్రేమించాను. రంగని తప్ప మరొకరిని పెళ్లాడను.. ’’ అని తన నిర్ణయాన్ని చెప్పింది. ఎన్నో విధాలుగా విష్ణుచిత్తుడు ఆమె మనసును మార్చాలని చూశాడు. కాని అచంచలమైన నమ్మకంతో ఉన్న ఆముక్తమాల్యద తన నిర్ణయం కూడా అచంచలమైనదనే చెప్పింది. ఆతల్లి ఆ రంగని పొందాలని సదా రంగని తలపుల్లోనే గడిపేది. అంతేకాక ప్రతిరోజు ఆ రంగని కీర్తించడానికి తన తోటివాళ్లను కూడా ప్రేరేపించి మరీ తీసుకొని వెళ్లి వాళ్లందరితో కలసి శ్రీవ్రతాన్ని ఆచరించింది. అపుడు పాశురాలను పాడుతూ ఆ శ్రీకృష్ణుని మహిమను వర్ణించేది. చివరకు పాండురంగనే ఆ తల్లి వరించి రంగనితో అంగరంగవైభోగంగా వివాహం చేసుకొంది. ఆనాడు ఆ తల్చి రచించి పాడిన పాటలే తిరుప్పావై గా నేడు రూపొందాయి. ఆ పాశురాలల్లోనే మానవులు తమ జన్మను ఎలా సార్థకం చేసుకోవాలో చెప్పింది. ఆ పాశురాలను అనుసంధానించుకొంటూ నే సర్వాంతర్యామి అయిన భగవంతుని పొందేమార్గాన్ని ఈ తల్లి చూపించింది.
అట్లాంటి పాశురాలను సరళ వచనంతో చక్కని చిక్కని భావావేశంతో వ్యాఖానించారు పింగళి పాండురంగారావు. అక్కడక్కడా ఆంగ్లంలోను ఆ తల్లి అనుభవించి మనకు అందించిన శ్రీకృష్ణామృతాన్ని ఉటంకించారు పింగళి. ఎన్నో ఆధ్యాత్మిక రచనలు చేసిన పింగళి నేడు ఈ ‘‘తిరుప్పావై పాశుర వైభవం ’’పాఠకలోకానికి అందించి తన జన్మ ధన్యమైనట్టుగా భావిస్తున్నారు. ఆ అండాళ్ తల్లి తనపై కురింపించి ప్రేమామృతమే ఈ కృష్ణామృతం అంటూ అందించిన ఈ ‘‘తిరుప్పావై పాశుర వైభవం’’ రంగని భక్తులకే కాక అందరికీ ఆసక్తిని కలిగించి ఏకబిగిన చదివించే నైపుణ్యంతో వుందనే అభిప్రాయాన్ని కలిగిస్తుంది.

- చరణశ్రీ