Others

దుష్టులను దునుమాడే నరసింహావతారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిఅంతము లేని భగవంతుని వ్యక్తమునకు మితి లేదని అని తెలియ చేసేదే ఈ నరసింహా వతారము. సృషి టస్థితి లయాదులకు కారణుడైన పరమాత్మను ఏ విధంగా ఉపాసిస్తే ఆ విధంగానే సాక్షాత్కరిస్తాడు. ఆ స్వామి నిర్గుణుడు, నిరాకా రుడు, నిర్మలుడు, నిస్సంశయంగా భగవంతుని ప్రార్థిస్తే చాలు ఆ దైవం కోరినరూపంలో కనిపించ డం కాదు కోరిన కోర్కెలనెల్లా ఈడేరుస్తాడని ఎందరో భక్తుల కథలను అనాదిగా వినవస్తూనే ఉన్నాయ. అట్టాంటి దైవం మీద మిత్రత్వమూ శత్రుత్వమూ లేకపోయనా దుష్టులు, దుర్మార్గులు అసురులైనవారు ఆ స్వామిపై కక్ష కట్టామని భ్రమిస్తుంటారు. ఆ స్వామిపై ప్రేమపెంచుకున్న వారు స్వామి ప్రీత్యర్థం చేసే యజ్ఞయాగాదులు ద్వసం చేస్తుంటారు. సోమయాజులను యాగాన్ని చూచి ఆనందంపొందేవారైన సాధుజనులను నానా హింసల పాలు చేస్తుంటారు. దైవం సాధువుల పక్షపాతి కనుక ఈ సాధువులను చింతకు గురిచేస్తే- ఆ స్వామి వారి బాధలను చూడలేక విలవిల్లాడి పరుగెత్తుక వస్తాడని రాక్షసులు భావిస్తారు. ఉన్నాడు ఉన్నాడని కొలిచేవారిని ఎక్కడ ఉన్నాడో చూపించమని అడిగితే వారికోసం కనిపిం చే ఆ దైవాన్ని మనం మట్టు పెట్టటం ఎంతో సులభ మైన కార్యమని నమ్మిన అజ్ఞానులు చావుపుట్టుకలు లేనివాడిని సంహరించాలన్న ఆకాంక్ష పెంచు కుంటారు. ఇట్లాంటి కోరికలున్న హిరణ్య కశ్యపుడు తన శత్రువును మట్టుపెట్టాలన్న దుశ్చింతనతో శ్రీహరి ఎక్కడ ఎక్కడున్నాడో చెప్పాలంటూ ఎన్నో హింసలకు గురిచేసిన రాక్షసాధముడు హిరణ్య కశ్యపుడు.
ఆ వైకుంఠుని తప్ప అన్యమెరుగక స్వామినే కీర్తించేవాడు. సంతోష మొచ్చినా, దుఃఖమొచ్చినా సర్వానికి కారణం ఆ దేవదేవుడే అని నమ్మి కొలిచే వాడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుని శ్రీహరిని చూపించమని అడుగుతుంటే ‘‘సందేహమేమీ అక్కర్లేదు తండ్రీ నీవు ఎక్కడ చూడాలనుకొంటే అక్కడే కనిపిస్తాడు ఆ శ్రీహరి’’ అని చెప్పాడు. అయనా నమ్మని హిరణ్యకశిపుడు స్తంభాన్ని చూపి ఇక్కడ నుంచి వస్తాడా నీ హరిని రమ్మను వాడి తల నరుకుతాను అని భీకరారావం చేశాడు. స్వామిపైన పగవద్దని ఎంత చెప్పినా వినని హిరణ్యకశిపుడిని ఇక శ్రీహరినే బాగుచేయాలని ప్రహ్లాదుడు స్వామినే ప్రార్థించాడు. వెనువెంటనే నలుదిక్కులా దిక్కులు పిక్కటిల్లేలా భయంకర శబ్దాలు ఏర్పడ్డాయ. స్తంభం పగులకొట్టుకుని నరమృగరూపంలో స్వా మి భయంకరమైన ఆకారంతో ఆవిర్భవించాడు. ఎర్రనికాంతులు వెదజల్లే స్వామి కనులు కోపంతో ప్రజ్వలిస్తూన్నాయ. అవిచూచేవారికి కణకణమండే అగ్నిని తలపిస్తున్నాయి. ప్రసన్నవదనంతో చిరు నవ్వును చిందించే ఆ స్వామి మోము మోదుగు పూవును పోలింది. తెల్లని కోరలు మృత్యుఘంటల్లా కనిపిస్తున్నాయ. ఆ స్వామి గంభీరమైన సముద్ర ఘోషలాంటి హుంకారం చేశాడు. తామర తూడులను పోలి ఉండే ఆ బాహువులు భీతి కొలిపేలా వణుకుతూ పదునైన గోళ్లతో చూచేవారికే భయాన్ని కలిగించాయ. ఆ స్వామి పదఘట్టనలు సర్వలోకాలను గజగజలాడించాయ. ఆ స్వామి హిరణ్యకశపుని వైపు అడుగులు వేస్తూ తన చేతిని చాపి హిరణ్యకశ్యపుని పట్టుకుని తన తొడలపై అడ్డంగా పడవేసి సంధ్యా చీకట్లు అలుము కుంటుండగా హిరణ్యకశ్యపుని హృదయకుహు రాన్ని చీల్చివేశాడు. అక్కడ ఉన్న దేవదానవుంతా స్వామిని తమపై అవాజ్యమైన కరుణను కురిపించ మని వేడుకున్నారు. ఆ శ్రీహరి ఆ అవతారా విశేషానే్న నరసింహావతారం అన్నారు. ఈ స్వామి ఎనె్నన్నో ప్రదేశాలల్లో స్వయంభూగా వెలిశాడు.
‘‘యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం॥ భగవద్గీతలో చెప్పినట్టుగానే స్వామి నమ్ముకొని ధర్మాన్ని ఆచరిస్తే చాలు భగవంతుడు మనకు ఎల్లవేళలా తోడునీడగా ఉంటాడు. దైవం ఆశీస్సులు సదా కాపాడుతాయ. సత్యధర్మాలే భగవంతుని రూపాలని నమ్మి చరించేవారే ఆ దేవదేవుని ప్రతి రూపాలుగా భాసిల్లుతారు.

- చివుకుల రామమోహన్